
Photo: IPL Twitter
ఐపీఎల్ 16వ సీజన్‌లో ఆర్‌సీబీ మరో విజయం దిశగా పరుగులు పెడుతుంది. గురువారం పంజాబ్ కింగ్స్‌తో మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసి ఆర్‌సీబీ నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 174 పరుగులు చేసింది. అనంతరం 175 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్ కింగ్స్ 10 ఓవర్లు ముగిసేరికి 77 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.
ఇదిలా ఉంటే ఆర్‌సీబీ బౌలర్ సిరాజ్ పంజాబ్ బ్యాటర్ హర్‌ప్రీత్ సింగ్ బాటియాను రనౌట్ చేయడం మ్యాచ్‌కే హైలెట్‌గా నిలిచింది. ఇన్నింగ్స్ ఆరో ఓవర్లో విజయ్‌కుమార్ వేసిన మూడో బంతిని ప్రబ్‌సిమ్రన్ సింగ్ మిడాఫ్ దిశగా ఆడాడు. సింగిల్ తీసే ప్రయత్నం చేసిన ప్రబ్‌సిమ్రన్ నాన్‌స్ట్రైక్‌లో ఉన్న హర్‌ప్రీత్ బాటియాకు కాల్ ఇచ్చాడు.
ప్రబ్‌సిమ్రన్ పిలుపుతో హర్‌ప్రీత్ పరిగెత్తాడు. కానీ బంతిని అందుకున్న సిరాజ్ డైరెక్ట్ త్రో విసిరాడు. హర్‌ప్రీత్ క్రీజులోకి వచ్చేలోపే బంతి వికెట్లను గిరాటేసింది. దీంతో అతను రనౌట్‌గా వెనుదిరిగాల్సి వచ్చింది. డైరెక్ట్ త్రోతో స్టన్నింగ్ రనౌట్ చేసిన సిరాజ్ రొనాల్డో ఫేమస్ 'Sui' సెలబ్రేషన్‌తో మెరిశాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
WHAT A THROW, SIRAJ 🔥pic.twitter.com/iFouuBYLpe
— Johns. (@CricCrazyJohns) April 20, 2023
Comments
Please login to add a commentAdd a comment