IPL 2023: Mohammed Siraj Best Bowling Figures In IPL Career Vs Punjab Kings - Sakshi
Sakshi News home page

#MohammedSiraj: హైలెట్‌ అయిన హైదరాబాదీ..  ఐపీఎల్‌లో బెస్ట్‌ బౌలింగ్‌ ఫిగర్స్‌

Published Thu, Apr 20 2023 7:38 PM | Last Updated on Thu, Apr 20 2023 8:43 PM

Mohammed Siraj Best Bowling Figures In IPL Career Vs Punjab Kings - Sakshi

Photo: IPL Twitter

ఐపీఎల్‌ 16వ సీజన్‌లో ఆర్‌సీబీ మూడో విజయాన్ని నమోదు చేసింది. గురువారం మొహలీ వేదికగా పంజాబ్‌ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆర్‌సీబీ 24 పరుగుల తేడాతో ఘన విజయాన్ని అందుకుంది. కాగా మ్యాచ్‌ మొత్తంలో హైలెట్‌గా నిలిచింది మాత్రం హైదరాబాదీ మహ్మద్‌ సిరాజ్‌.


Photo: IPL Twitter

4 ఓవర్లలో 21 పరుగులిచ్చి నాలుగు వికెట్లు పడగొట్టడమే గాక డైరెక్ట్‌ హిట్‌తో పంజాబ్‌ బ్యాటర్‌ను రనౌట్‌ చేయడం విశేషం. ఒక రకంగా సిరాజ్‌ ఐదు వికెట్ల ఫీట్‌(నాలుగు వికెట్లు+ రనౌట్‌) సాధించినట్లే. ఇక పంజాబ్‌పై నాలుగు వికెట్ల ప్రదర్శన సిరాజ్‌కు ఐపీఎల్‌లో బెస్ట్‌ బౌలింగ్‌ ఫిగర్స్‌ అని చెప్పొచ్చు.


Photo: IPL Twitter

మ్యాచ్‌ ముగిసిన అనంతరం సిరాజ్‌ మాట్లాడుతూ.. ''మ్యాచ్‌లో తొలి బంతిని షార్ట్‌ లెంగ్త్‌ వేశాను.. కానీ తర్వాత నుంచి స్వింగ్‌పై దృష్టి పెట్టి వికెట్‌ తీయాలనుకున్నా. అది సక్సెస్‌ అయింది. లాక్‌డౌన్‌ నాలో చాలా మార్పు తీసుకొచ్చింది. లాక్‌డౌన్‌కు ముందు ఆడిన మ్యాచ్‌ల్లో వికెట్లు తీసుకున్నప్పటికి బౌండరీలు సమర్పించుకునేవాడిని.

దాంతో అందరూ నన్ను టార్గెట్‌ చేశారు. దీనిని మార్చాలనుకున​న్నా.. అందుకోసం నా ప్లాన్‌, ఫిట్‌నెస్‌, బౌలింగ్‌ స్టైల్‌ను పూర్తిగా మార్చుకున్నా. ఇక మ్యాచ్‌లో నేను డీసెంట్‌ ఫీల్డర్‌నే.. మిస్‌ఫీల్డ్‌ చేయడం సహజం.. కానీ ప్రతీ మ్యాచ్‌లోనూ ఫీల్డింగ్‌ను సీరియస్‌గానే తీసుకుంటా'' అని చెప్పుకొచ్చాడు.

చదవండి: సిరాజ్‌ను పూనిన రొనాల్డో.. వీడియో వైరల్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement