PC: AFP
Cristiano Ronaldo: ఫిఫా ప్రపంచకప్-2022 ఆదివారం(నవంబర్20)న దోహా వేదికగా అట్టహాసంగా ప్రారంభమైంది. తొలి మ్యాచ్‌లో అతిథ్య ఖతర్ జట్టును ఈక్వెడార్ 2-0 గోల్స్ తేడాతో ఓడించింది. ఇక ఈ మెగా ఈవెంట్‌లో భాగంగా సోమవారం(నవంబర్ 21) రెండు మ్యాచ్‌లు జరగనున్నాయి. తొలి మ్యాచ్‌లో ఇరాన్‌తో ఇంగ్లండ్.. రెండో మ్యాచ్‌లో సెనెగల్, నెదర్లాండ్స్ జట్లు అమీతుమీ తేల్చుకోవడానికి సిద్దమయ్యాయి.
ఇక ఇది ఇలా ఉండగా.. పోర్చుగల్ ఫుట్‌బాల్ స్టార్ క్రిస్టియానో రొనాల్డో ఇటీవల ఓ టీవీ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాంచెస్టర్ యునైటెడ్‌తో పాటు ఆ జట్టు కోచ్‌పై తీవ్ర విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. మాంచెస్టర్ యునైటెడ్‌తో పాటు ఆ జట్టు మేనేజర్ తనకు ద్రోహం చేశాడంటూ ఆరోపణలు చేశాడు. ఇదే విషయంపై మరోసారి రొనాల్డో స్పందించాడు. మాంచెస్టర్ యునైటెడ్‌తో తన గొడవ ప్రపంచకప్‌లో తమ జట్టుపై ఎటువంటి ప్రభావం చూపదని క్రిస్టియానో రొనాల్డో తెలిపాడు.
విలేకరుల సమావేశంలో రొనాల్డో మాట్లాడూతూ.. "మాంచెస్టర్‌తో క్లబ్‌తో విభేదాలు ఆటగాడిగా నన్ను ప్రభావితం చేయవచ్చు. కానీ ఇటువంటి గొడవలు, వ్యక్తిగత విభేదాలు మా జట్టుపై ఏ మాత్రం ప్రభావం చూపవు" అని అతడు పేర్కొన్నాడు. ఇక ఈ మెగా ఈవెంట్‌లో భాగంగా పోర్చ్‌గల్ తమ తొలి మ్యాచ్‌లో నవంబర్ 24న ఘనాతో తలపడనుంది.
చదవండి: FIFA World Cup 2022: అమెరికా కెప్టెన్‌గా 23 ఏళ్ల టైలర్ ఆడమ్స్
Cristiano Ronaldo: 'పగవాడికి కూడా ఈ కష్టం రాకూడదు'
Comments
Please login to add a commentAdd a comment