Cristiano Ronaldo Million-Dollar Bugatti Veyron Has Involved In Spain Accident, Details Inside - Sakshi
Sakshi News home page

Cristiano Ronaldo: కోట్ల విలువైన కారుకు యాక్సిడెంట్‌.. రొనాల్డో క్షేమంగానే

Published Tue, Jun 21 2022 12:05 PM | Last Updated on Tue, Jun 21 2022 12:51 PM

Cristiano Ronaldo Million-Dollar Bugatti Veyron Crashed Spain Accident - Sakshi

పోర్చుగల్‌ ఫుట్‌బాల్‌ స్టార్‌ క్రిస్టియానో రొనాల్డోకు అభిమానుల్లో  ఉన్న క్రేజ్‌ సంగతి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇన్‌స్టాగ్రామ్‌లోనే అత్యధిక ఫాలోవర్లు ఉన్న ఆటగాడిగా అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. ఇక రొనాల్డోకు కార్లంటే యమా క్రేజ్‌. తన ఇంట్లోనే దాదాపు అన్ని మోడల్స్‌కు సంబంధించిన కార్లను కలెక్షన్‌గా కలిగి ఉన్నాడు. తాజాగా రొనాల్డోకు సంబంధించిన కోట్ల విలువైన కారు  అయింది. 1.8 యూరో మిలియన్‌(భారత కరెన్సీలో దాదాపు రూ. 14 కోట్ల 87 లక్షలు) డాలర్ల విలువ కలిగిన బుగట్టి వెయ్రోన్ సూపర్‌ కార్‌ మేజర్‌ యాక్సిడెంట్‌కు గురయ్యింది.

స్థానిక మీడియా కథనం ప్రకారం.. సోమవారం స్పెయిన్‌లోని రొనాల్డో నివాసం ముందే కారు ప్రమాదం జరిగినట్లు తెలిసింది. యాక్సిడెంట్‌ జరిగినప్పుడు మొదట రొనాల్డో కారులోనే ఉన్నట్లు వార్తలు వచ్చాయి. అయితే ఈ ఫుట్‌బాల్‌ స్టార్‌ ప్రస్తుతం హాలిడే గడపడానికి తన ఫ్యామిలితో కలిసి ఒక ఐలాండ్‌లో ఉన్నట్లు తెలిసింది. కాగా రొనాల్డో కారును తన డ్రైవర్‌ తీసుకెళ్లాడని.. కారును కంట్రోల్‌ చేయడంలో పట్టు కోల్పోవడంతో రొనాల్డో ఇంటి ముందు ఉన్న గోడను బలంగా ఢీకొట్టింది. కారులో ఉన్న డ్రైవర్‌కు ఎలాంటి గాయాలు కానప్పటికి.. కారు ముందు భాగం మాత్రం​ బాగా దెబ్బతింది.

సమాచారం అందుకున్న పోలీసులు కారును ఆటోగ్యారెజ్‌కు తరలించారు. ఏ ఇతర వాహనము కారును యాక్సిడెంట్‌ చేయలేదని.. డ్రైవర్‌ తనంతట తానుగానే పట్టు తప్పడంతో కారుకు యాక్సిడెంట్‌ అయిందని పేర్కొనడంతో అతనిపై కేసు నమోదు చేశారు. కాగా రొనాల్డో ఎంతో ఇష్టపడి కొనుకున్న కారు రిపేరుకు సంబంధించిన బిల్‌ పెద్దదిగానే ఉండనుందని అభిమానులు కామెంట్స్‌ చేశారు.


చదవండి: Neeraj Chopra: భారత్‌ స్టార్‌ నీరజ్‌ చోప్రాకు తప్పిన పెను ప్రమాదం

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement