Cristiano Ronaldo Creates History 801st Goal Manchester United vs Arsenal - Sakshi
Sakshi News home page

Cristiano Ronaldo: రొనాల్డో కొత్త చరిత్ర.. ఎవరికి అందనంత ఎత్తులో

Published Fri, Dec 3 2021 9:13 AM | Last Updated on Fri, Dec 3 2021 9:23 AM

Cristiano Ronaldo Creates History 801st Goal Manchester United vs Arsenal - Sakshi

Cristiano Ronaldo Histroy 801 Goal.. పోర్చుగల్‌ ఫుట్‌బాల్‌ స్టార్‌.. మాంచెస్టర్‌ యునైటెడ్‌ ఆటగాడు క్రిస్టియానో రొనాల్డో చరిత్ర సృష్టించాడు. తన కెరీర్‌లో రొనాల్డో 800వ గోల్‌ నమోదు చేశాడు. మాంచెస్టర్‌ యునైటెడ్‌, ఆర్సినల్‌ మధ్య జరిగిన మ్యాచ్‌లో రొనాల్డో ఈ ఘనత​ అందుకున్నాడు. ఓవరాల్‌గా మ్యాచ్‌లో రెండు గోల్స్‌ నమోదు చేసిన రొనాల్డో 801 గోల్స్‌తో ఎవరికి అందనంత ఎత్తులో నిలవడం విశేషం. ఇప్పటివరకు అన్ని మ్యాచ్‌లు కలిపి 1138 వరకు ఆడిన రొనాల్డో.. క్లబ్‌ లీగ్స్‌ తరపున 485 గోల్స్‌, పోర్చుగల్‌ తరపున 115, కాంటినెంటల్‌లో 150, వివిధ మేజర్‌ కప్‌ టోర్నీల్లో 51 గోల్స్‌ సాధించాడు.

చదవండి: Cristiano Ronaldo: రొనాల్డో బాడీగార్డ్స్‌గా వ్యవహరిస్తున్నదెవరో తెలుసా!


ఇక ఆఖరి నిమిషం వరకు హోరాహోరీగా సాగిన మ్యాచ్‌లో మాంచెస్టర్‌ యునైటెడ్‌ 3-2 తేడాతో ఆర్సినల్‌పై ఘన విజయాన్ని అందుకుంది. మాంచెస్టర్‌ యునైటెడ్‌ తరపున బ్రూనో ఫెర్నాండ్స్‌ ఆట 44వ నిమిషంలో, క్రిస్టియానో రొనాల్డో(ఆట 52వ నిమిషం, 70వ నిమిషంలో) గోల్స్‌ సాధించగా.. ఆర్సినల్‌ తరపున స్మిత్‌ రోవ్‌ ఆట 13వ నిమిషంలో.. ఓడీగార్డ్‌ ఆట 54వ నిమిషంలో గోల్‌ సాధించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement