Arsenal club
-
ఫుట్‌బాల్ దిగ్గజం కాంప్‌బెల్ కన్నుమూత..
ఫుట్‌బాల్ దిగ్గజం, అర్సెనల్ ఎఫ్‌సీ లెజెండ్ కెవిన్ కాంప్‌బెల్(54) కన్నుమశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న కాంప్‌బెల్.. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం తుదిశ్వాస విడిచారు. విన్ కాంప్‌బెల్ మరణ వార్తను అర్సెనల్ ఎఫ్‌సీ సోషల్ మీడియా వేదికగా ధ్రువీకరించింది."మా క్లబ్ మాజీ స్ట్రైకర్ కెవిన్ కాంప్‌బెల్ అనారోగ్యం కారణంగా మృతిచెందాడు. అతడి మరణ వార్త మమ్మల్ని కలిచివేసింది. కెవిన్ని క్లబ్లో ప్రతీఒక్కరూ గౌరవించేవారు. ఆ కష్టసమయంలో కెవిన్ కుటంబసభ్యులకు ఆ దేవుడు అండగా నిలివాలని కోరుకుంటున్నాము. అదేవిధంగా కాంప్‌బెల్ ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్ధిస్తున్నాము" అని అర్సెనల్ ఎఫ్‌సీ ఎక్స్‌లో రాసుకొచ్చింది. ఫుట్‌బాల్ వరల్డ్‌లో కాంప్‌బెల్ తనకంటూ ఒక ప్రత్యేకగుర్తింపు తెచ్చుకున్నారు. 1988లో ఆర్సెనల్ ఫుట్‌బాల్ క్లబ్‌తో తన కెరీర్‌ను ప్రారంభించిన కాంప్‌బెల్.. రెండు దశాబ్దాలకు పైగా ఫుట్‌బాల్ గేమ్‌లో కొనసాగారు. 1988లో ఆర్సెనల్ తరపున ఫుట్‌బాల్ ఆసోషియేషన్ యూత్ కప్‌ను గెలుచుకున్నాడు. అంతేకాకుండా ప్రీమియర్ లీగ్‌లో అర్సెనల్ , నాటింగ్‌హామ్ ఫారెస్ట్ , ఎవర్టన్ , వెస్ట్ బ్రోమ్విచ్ అల్బియన్ జట్ల తరపున కూడా అర్సెనల్ ఆడాడు. కాంప్‌బెల్ తన కెరీర్లో ఓవరాల్‌గా 148 గోల్స్ చేశాడు. We are devastated to learn that our former striker Kevin Campbell has died after a short illness.Kevin was adored by everyone at the club. All of us are thinking of his friends and family at this difficult time.Rest in peace, Kevin ❤️ pic.twitter.com/Kiywyo7nTr— Arsenal (@Arsenal) June 15, 2024 -
రొనాల్డో కొత్త చరిత్ర.. ఎవరికి అందనంత ఎత్తులో
Cristiano Ronaldo Histroy 801 Goal.. పోర్చుగల్ ఫుట్‌బాల్ స్టార్.. మాంచెస్టర్ యునైటెడ్ ఆటగాడు క్రిస్టియానో రొనాల్డో చరిత్ర సృష్టించాడు. తన కెరీర్లో రొనాల్డో 800వ గోల్ నమోదు చేశాడు. మాంచెస్టర్ యునైటెడ్, ఆర్సినల్ మధ్య జరిగిన మ్యాచ్‌లో రొనాల్డో ఈ ఘనత అందుకున్నాడు. ఓవరాల్‌గా మ్యాచ్‌లో రెండు గోల్స్ నమోదు చేసిన రొనాల్డో 801 గోల్స్‌తో ఎవరికి అందనంత ఎత్తులో నిలవడం విశేషం. ఇప్పటివరకు అన్ని మ్యాచ్‌లు కలిపి 1138 వరకు ఆడిన రొనాల్డో.. క్లబ్ లీగ్స్ తరపున 485 గోల్స్, పోర్చుగల్ తరపున 115, కాంటినెంటల్‌లో 150, వివిధ మేజర్ కప్ టోర్నీల్లో 51 గోల్స్ సాధించాడు. చదవండి: Cristiano Ronaldo: రొనాల్డో బాడీగార్డ్స్‌గా వ్యవహరిస్తున్నదెవరో తెలుసా! ఇక ఆఖరి నిమిషం వరకు హోరాహోరీగా సాగిన మ్యాచ్‌లో మాంచెస్టర్ యునైటెడ్ 3-2 తేడాతో ఆర్సినల్పై ఘన విజయాన్ని అందుకుంది. మాంచెస్టర్ యునైటెడ్ తరపున బ్రూనో ఫెర్నాండ్స్ ఆట 44వ నిమిషంలో, క్రిస్టియానో రొనాల్డో(ఆట 52వ నిమిషం, 70వ నిమిషంలో) గోల్స్ సాధించగా.. ఆర్సినల్ తరపున స్మిత్ రోవ్ ఆట 13వ నిమిషంలో.. ఓడీగార్డ్ ఆట 54వ నిమిషంలో గోల్ సాధించారు. 💯💯💯💯💯💯💯💯@Cristiano is out of this world 🌍#MUFC pic.twitter.com/UaQjnCUNH0 — Manchester United (@ManUtd) December 2, 2021 -
ఓక్రిడ్జ్‌లో ముగిసిన అర్సెనల్ సాకర్ క్యాంప్
రాయదుర్గం, న్యూస్‌లైన్: ఖాజాగూడలోని ఓక్రిడ్జ్ అంతర్జాతీయ పాఠశాలలో నిర్వహించిన అర్సెనల్ సాకర్ కోచింగ్ క్యాంప్ మంగళవారం ముగిసింది. 6 నుంచి 16 ఏళ్ళలోపు విద్యార్థులకు ఈ శిబిరంలో శిక్షణ ఇచ్చారు. వారం రోజుల పాటు జరిగిన ఈ క్యాంపులో 78 మంది విద్యార్థులు ఫుట్‌బాల్ నేర్చుకున్నారు. ఇందులో ఆరుగురు విద్యార్థినిలు కూడా ఉన్నారు. మంగళవారం జరిగిన ముగింపు కార్యక్రమంలో అర్సెనల్ క్లబ్‌కు చెందిన కోచ్ జువాన్ జోన్స్ మాట్లాడుతూ ఫుట్‌బాల్‌కు భారత్‌లో ప్రాచుర్యం కల్పించేందుకు ఈ తరహా శిక్షణ శిబిరాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. విడతల వారిగా మిగతా నగరాల్లో శిక్షణ శిబిరాలు నిర్వహిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఓక్రిడ్జ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ హెడ్ డేవిడ్ రాజ్‌కుమార్, ఫుట్‌బాల్ కోచ్‌లు దినేష్, రాము, అల్తిమస్.. ఓక్రిడ్జ్, డీపీఎస్, అజ్మీర్‌కు చెందిన విద్యార్థులు పాల్గొన్నారు. తిరిగి ఈనెల 8వ తేదీ నుంచి 13వ తేదీ వరకు బాచుపల్లిలోని ఓక్రిడ్జ్ అంతర్జాతీయ పాఠశాలలో రెండో విడత శిక్షణ కార్యక్రమం జరగనుంది.