మాంచెస్టర్: ఇంగ్లండ్‌లోని మాంచెస్టర్ సిటీకి కొత్త కళ వచ్చింది. క్రీడల్లో వేర్వేరు ఆటలకు సంబంధించిన రెండు పెద్ద తలలు ఇక్కడ అడుగుపెట్టడంతో అభిమానులు సంతోషంలో మునిగి తేలుతున్నారు. విషయంలోకి వెళితే ఒకరు క్రికెట్‌లో మెషిన్‌గన్ అయితే.. మరొకరు ఫుట్‌బాల్‌లో కింగ్‌గా పేరుపొందారు. వారే టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి.. మరొకరు పోర్చుగల్ ఫుట్‌బాల్ స్టార్ ఆటగాడు క్రిస్టియానో రొనాల్డో. ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్ నేపథ్యంలో రెండు జట్ల మధ్య చివరిదైన ఐదో టెస్టు మాంచెస్టర్ వేదికగా ఓల్డ్ ట్రాఫర్డ్ మైదానంలో నేటి నుంచి జరగనుంది. ఈ సందర్భంగా టీమిండియా ఇప్పటికే ప్రాక్టీస్‌ను ఆరంభించింది.
చదవండి: T20 World Cup 2021: విండీస్ టీ20 జట్టు ఇదే.. ఆరేళ్ల తర్వాత ఆ ఆటగాడికి పిలుపు
ఇటీవలే 12 ఏళ్ల విరామం తర్వాత మాంచెస్టర్ యునైటెడ్ క్లబ్‌లో చేరిన క్రిస్టియానో రొనాల్డో ఓల్డ్ ట్రాఫర్డ్‌లోనే న్యూకాసిల్ యునైటెడ్‌తో మ్యాచ్ ఆడనున్నాడు. ఈ సందర్భంగా లంకాషైర్ క్రికెట్ వినూత్న రీతిలో ట్వీట్ చేసింది. కోహ్లి, రొనాల్డోలు ఒక దగ్గరే ఉన్నారు. వారిద్దిర జాయింట్ ప్రాక్టీస్ సెషన్‌ను మీకు చూడాలని ఉందా అంటూ రాసుకొచ్చింది. దీనిపై మాంచెస్టర్ యునైటెడ్ క్లబ్ స్పందింస్తూ.. వన్ సిటీ.. టూ గోట్స్ అంటూ కామెంట్ చేసింది. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా మారింది.
ఇక టీమిండియా ఇప్పటికే ఐదు టెస్టుల సిరీస్‌లో 2-1 తేడాతో ఆధిక్యంలోకి వెళ్లింది. టీమిండియా ఈ మ్యాచ్ డ్రా చేసుకున్న సిరీస్ సొంతం అవుతుంది. అయితే ఇంగ్లండ్ మాత్రం చివరి టెస్టులో విజయం సాధించి సిరీస్‌ను సమం చేయాలని భావిస్తోంది.
చదవండి: Messi VS Pele: 'నాకు అతనితో పోలికేంటి'.. దెబ్బకు దెబ్బ తీశాడు
One city, two GOATs 😉
— Manchester United (@ManUtd) September 9, 2021
Comments
Please login to add a commentAdd a comment