Old Trafford
-
ఐదో మ్యాచ్ రద్దు.. 2-1 ఆధిక్యంలో టీమిండియా.. ఇక..
మాంచెస్టర్: టీమిండియా- ఇంగ్లండ్ మధ్య జరగాల్సిన ఐదో టెస్టు రద్దైంది. ఈ మేరకు ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు అధికారిక ప్రకటన చేసింది. కాగా ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లో టీమిండియా ఇప్పటికే 2-1తో ఆధిక్యంలో ఉన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో.. ఓల్డ్ ట్రఫోర్ట్ మైదానంలో జరగాల్సిన ఆఖరి మ్యాచ్ రద్దు కావడంతో సిరీస్ కోహ్లి సేన సొంతం కావడం ఇక లాంఛనమేననే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయితే, ఇందుకు సంబంధించి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. మరోవైపు... అత్యంత కీలకమైన, నిర్ణయాత్మకమైన ఐదో టెస్టు కోవిడ్ కారణంగా రద్దు కావడంతో.. జూలైలో టీమిండియా ఇంగ్లండ్ పర్యటన(పరిమిత ఓవర్ల క్రికెట్) నేపథ్యంలో అప్పుడు ఈ టెస్టు మ్యాచ్ నిర్వహించేలా సంప్రదింపులు జరుగుతున్నట్లు సమాచారం. ఆ ఫలితం ఆధారంగానే సిరీస్ విజేతను నిర్ణయించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇక మ్యాచ్‌కు ముందు గురువారం టీమిండియా పిజియోథెరపిస్ట్ యోగేశ్ పర్మార్‌కు కోవిడ్ పాజిటివ్‌గా తేలిన విషయం తెలిసిందే. అతనితో పాటు శిక్షణ సిబ్బందిలో మరికొందరు మహమ్మారి బారిన పడడంతో మ్యాచ్‌ను వాయిదా వేస్తున్నట్లు ఈసీబీ తొలుత ప్రకటించింది. ఆటగాళ్లతో పాటు జట్టు సిబ్బంది అందరికీ కరోనా నిర్దారణ పరీక్షలు నిర్వహించి ఫలితాలు వచ్చాకే మ్యాచ్‌పై నిర్ణయం తీసుకుంటామని తెలిపింది. ఈ క్రమంలో బీసీసీఐతో చర్చించిన అనంతరం మ్యాచ్ రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. కాగా ఆటగాళ్లందరికీ నెగిటివ్ వచ్చినప్పటికీ ఆడేందుకు సుముఖంగా లేకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఇక తొలి టెస్టు డ్రాగా ముగియగా.. రెండో టెస్టులో భారత్, మూడో టెస్టులో ఇంగ్లండ్ గెలుపొందాయి. ఇక నాలుగో టెస్టులో విజయం సాధించిన టీమిండియా 2-1తో ఆధిక్యంలో కొనసాగుతుండగా.. నిర్ణయాత్మక ఐదో టెస్టు రద్దైంది. చదవండి: T20 World Cup 2021: విండీస్ టీ20 జట్టు ఇదే.. ఆరేళ్ల తర్వాత ఆ ఆటగాడికి పిలుపు Six Balls Six Sixes: ఆరు బంతుల్లో ఆరు సిక్సర్లు.. వీడియో వైరల్ -
మాంచెస్టర్‌లో కొత్త చరిత్ర.. రెండు పెద్ద తలలు ఇక్కడే
మాంచెస్టర్: ఇంగ్లండ్‌లోని మాంచెస్టర్ సిటీకి కొత్త కళ వచ్చింది. క్రీడల్లో వేర్వేరు ఆటలకు సంబంధించిన రెండు పెద్ద తలలు ఇక్కడ అడుగుపెట్టడంతో అభిమానులు సంతోషంలో మునిగి తేలుతున్నారు. విషయంలోకి వెళితే ఒకరు క్రికెట్లో మెషిన్‌గన్ అయితే.. మరొకరు ఫుట్‌బాల్‌లో కింగ్‌గా పేరుపొందారు. వారే టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి.. మరొకరు పోర్చుగల్ ఫుట్‌బాల్ స్టార్ ఆటగాడు క్రిస్టియానో రొనాల్డో. ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్ నేపథ్యంలో రెండు జట్ల మధ్య చివరిదైన ఐదో టెస్టు మాంచెస్టర్ వేదికగా ఓల్డ్ ట్రాఫర్డ్ మైదానంలో నేటి నుంచి జరగనుంది. ఈ సందర్భంగా టీమిండియా ఇప్పటికే ప్రాక్టీస్‌ను ఆరంభించింది. చదవండి: T20 World Cup 2021: విండీస్ టీ20 జట్టు ఇదే.. ఆరేళ్ల తర్వాత ఆ ఆటగాడికి పిలుపు ఇటీవలే 12 ఏళ్ల విరామం తర్వాత మాంచెస్టర్ యునైటెడ్ క్లబ్లో చేరిన క్రిస్టియానో రొనాల్డో ఓల్డ్ ట్రాఫర్డ్లోనే న్యూకాసిల్ యునైటెడ్‌తో మ్యాచ్ ఆడనున్నాడు. ఈ సందర్భంగా లంకాషైర్ క్రికెట్ వినూత్న రీతిలో ట్వీట్ చేసింది. కోహ్లి, రొనాల్డోలు ఒక దగ్గరే ఉన్నారు. వారిద్దిర జాయింట్ ప్రాక్టీస్ సెషన్‌ను మీకు చూడాలని ఉందా అంటూ రాసుకొచ్చింది. దీనిపై మాంచెస్టర్ యునైటెడ్ క్లబ్ స్పందింస్తూ.. వన్ సిటీ.. టూ గోట్స్ అంటూ కామెంట్ చేసింది. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా మారింది. ఇక టీమిండియా ఇప్పటికే ఐదు టెస్టుల సిరీస్‌లో 2-1 తేడాతో ఆధిక్యంలోకి వెళ్లింది. టీమిండియా ఈ మ్యాచ్ డ్రా చేసుకున్న సిరీస్ సొంతం అవుతుంది. అయితే ఇంగ్లండ్ మాత్రం చివరి టెస్టులో విజయం సాధించి సిరీస్‌ను సమం చేయాలని భావిస్తోంది. చదవండి: Messi VS Pele: 'నాకు అతనితో పోలికేంటి'.. దెబ్బకు దెబ్బ తీశాడు One city, two GOATs 😉 — Manchester United (@ManUtd) September 9, 2021 -
కుప్పకూలిన టాప్ ఆర్డర్, భారత్ (46/4)
మాంచెస్టర్: పటౌడీ కప్ లో భాగంగా ఇంగ్లాండ్ పర్యటనలో ఉన్న భారత జట్టు నాలుగవ టెస్ట్ లో పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది. టాస్ గెలిచి బ్యాటింగ్ చేపట్టిన భారత జట్టును బ్రాడ్, అండర్సన్ లు కుప్పకూల్చారు. భారత జట్టులో మురళీ విజయ్, పూజారా, కోహ్లీలు పరుగులేమి చేయకుండానే పెవిలియన్ చేరారు. గంభీర్ 4 పరుగులు చేసి బ్రాడ్ బౌలింగ్ లో అవుటయ్యాడు. ప్రస్తుతం రహానే, కెప్టెన్ ధోని లు క్రీజులో ఉన్నారు. అండర్సన్, బ్రాడ్ లు చెరో రెండు వికెట్లు సొంతం చేసుకున్నారు. ప్రస్తుతం (5.30 నిమిషాలకు) భారత జట్టు 4 వికెట్లు కోల్పోయి 46 పరుగులతో బ్యాటింగ్ కొనసాగిస్తోంది. నాలుగవ టెస్ట్ మాంచెస్టర్ లోని ఓల్డ్ ట్రాఫోర్డ్ లో జరుగుతోంది.