స్టార్ ఫుట్‌బాలర్, పోర్చుగల్ ప్లేయర్ క్రిస్టియానో రొనాల్డోపై అతని కొత్త క్లబ్ (సౌదీకి చెందిన అల్ నస్ర్ క్లబ్) సహచరుడు, ఆ జట్టు మిడ్ ఫీల్డర్ లూయిజ్ గుస్తావో సంచలన వ్యాఖ్యలు చేశాడు. రొనాల్డో వచ్చినప్పటి నుంచి తమ జట్టు గెలవడం కష్టంగా మారిందని లూయిజ్ ఆసక్తికర కామెంట్స్ చేశాడు. రొనాల్డో తమ జట్టులో ఉన్నందున ప్రత్యర్ధి జట్టు ఆటగాళ్లు రెండొందల శాతం ప్రదర్శన ఇస్తున్నారు.. అందువల్లే తమకు గెలవడం కష్టంగా మారిందని అన్నాడు.
ఇక, తమ జట్టు విషయానికొస్తే.. రొనాల్డో తమతో చేరినప్పటి నుంచి జట్టులో చాలా మార్పులు వచ్చాయి. ఫిజికల్‌గా, టెక్నికల్‌గా బలంగా ఉన్న రొనాల్డోను చూసి తాము చాలా నేర్చుకుంటున్నామని అన్నాడు. సవాళ్లు స్వీకరించి, వాటిని అధిగమించడంలో రొనాల్డో దిట్ట, అతని సహవాసంలో తాము కూడా ఈ విషయంలో మెరుగవుతున్నామని గుస్తావో తెలిపాడు.
కాగా, సౌదీ అరేబియాకు చెందిన అల్ నస్ర్ క్లబ్ ఇటీవలే రొనాల్డోతో భారీ డీల్ కుదుర్చుకున్న విషయం తెలిసిందే. అల్ నస్ర్ క్లబ్ రెండున్నరేళ్ల కాలానికి గానూ రొనాల్డోకు రూ.4400 కోట్ల భారీ మొత్తం అప్పజెప్పేందుకు డీల్ కుదుర్చుకుంది. ఈ క్లబ్‌తో ఒప్పందం కుదుర్చుకున్నాక రొనాల్డో ఆశించిన స్థాయి ప్రదర్శన కనబర్చలేకపోతున్నాడు.
తొలి మ్యాచ్‌లో గోల్ చేయకుండా నిరాశ పరిచిన GOAT.. శుక్రవారం అల్ ఫతేహీతో జరిగిన మ్యాచ్‌లో ఆఖరి నిమిషంలో ఓ గోల్ చేశాడు. ఫలితంగా అల్ నస్ర్ టీమ్ 2-2తో మ్యాచ్‌ను డ్రా చేసుకోగలిగింది. అల్ నస్ర్ తరఫున రొనాల్డో చేసిన మొదటి గోల్ ఇదే. సౌదీ ప్రో లీగ్‌లో రూడీ గార్సియా నేతృత్వంలో ఆడుతున్న రొనాల్డో.. అల్ నస్ర్ తరఫున 3 మ్యాచ్‌లు ఆడి కేవలం ఒక్క గోల్ మాత్రమే చేశాడు.
Comments
Please login to add a commentAdd a comment