
లండన్: ఐస్‌లాండ్‌లో విహారయాత్రకు వెళ్లిన మహారాష్ట్రీయుల కుటుంబం ఘోర రోడ్డు ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో ఇద్దరు మహిళలు, ఒక చిన్నారి ప్రాణాలు కోల్పోగా మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. బ్రిటన్‌లో ఉండే శ్రీరాజ్, సుప్రీం అనే సోదరులు తమ కుటుంబాలతో కలిసి ఐస్‌లాండ్‌లో ‘స్కీయోరార్సండర్’ పర్యాటక ప్రాంతానికి వాహనంలో బయలుదేరారు. గురువారం వేకువజామున నది వంతెన మీదుగా వెళ్తున్న ఆ వాహనం అదుపు తప్పి కిందకు పడింది. దీంతో ఇద్దరు మహిళలు, ఒక చిన్నారి అక్కడికక్కడే మృతి చెందినట్లు ఐస్‌లాండ్ పోలీసులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment