
ఎందుకు కట్టాలి?
ఇతని పేరు మాట్ బోటెన్. ఇంగ్లాండ్‌లోని కార్డిఫ్ నివాసి. గర్ల్‌ఫ్రెండ్‌తో కలసి ఐస్‌ల్యాండ్‌కు హాలీడే ట్రిప్‌నకు బయలుదేరాడు. గాత్విక్ ఎయిర్‌పోర్ట్‌లో చెక్ ఇన్‌కు వెళ్లగా... మీ లగేజీ నిర్ణీత పరిమితి కంటే ఎక్కువగా ఉంది... 45 పౌండ్లు (దాదాపు 4,250 రూపాయలు) కట్టాలని అక్కడి సిబ్బంది చెప్పారు. దీన్ని తప్పించుకోవడానికి మనోడికి వెంటనే ఓ ఐడియా తట్టింది.
బ్యాగును ఓపెన్ చేసి... అందులో ఉన్న దుస్తులన్నింటినీ ఇలా ధరించేశాడు. ఒకదానిపై మరొకటి వేసుకున్నాడు. చివరికి అదనంగా ఓ షూ జత ఉంటే దాన్నిలా ప్యాంటు రెండు జేబుల్లోకి దోపుకున్నాడు. తోటి ప్రయాణికులు నవ్వుకుంటున్నా... చెక్ ఇన్ సిబ్బంది నోళ్లు వెళ్లబెట్టి చూస్తుండగా... దర్జాగా వెళ్లి విమానంలో కూర్చున్నాడు. ఒక్క పైసా అదనంగా కట్టకుండానే. పైగా ఈ ఫొటో తీసి ‘నేను వెళుతోంది ఐస్‌ల్యాండ్‌కు కదా... అందుకే ఇలా’ అని క్యాప్షన్ కూడా పెట్టాడు.