India vs Australia, 2nd Test- Virat Kohli: రికార్డుల రారాజు, టీమిండియా స్టార్ విరాట్ కోహ్లి ఇటీవలే అంతర్జాతీయ కెరీర్‌లో 25 వేల పరుగుల మైలురాయిని చేరుకుని సరికొత్త చరిత్ర సృష్టించాడు. 549 ఇన్నింగ్స్‌లలో ఈ మేరకు రన్స్ పూర్తి చేసుకుని క్రికెట్ దేవుడు సచిన్ టెండుల్కర్ రికార్డు బద్దలు కొట్టాడు. అత్యంత వేగంగా 25000 పరుగుల మార్కును అందుకున్న తొలి బ్యాటర్‌గా కోహ్లి చరిత్రకెక్కాడు.
బోర్డర్- గావస్కర్ ట్రోఫీలో భాగంగా రెండో టెస్టు సందర్భంగా రన్‌మెషీన్ ఈ ఘనత సాధించాడు. ఆస్ట్రేలియాతో ఢిల్లీ టెస్టులో మొత్తంగా 64 పరుగులు చేసిన కోహ్లి జట్టు విజయంలో.. తద్వారా 2-0 ఆధిక్యం సాధించడంలో కీలక పాత్ర పోషించాడు. దీంతో కింగ్ కోహ్లి అభిమానులు ఖుషీ అవుతున్నారు.
అదే ఆఖరిది
ఇలాంటి సందర్భంలో ఐస్‌లాండ్ క్రికెట్ ప్రదర్శించిన అత్యుత్సాహం ఫ్యాన్స్‌కు ఆగ్రహం తెప్పించింది. కాగా అంతర్జాతీయ క్రికెట్‌లో ఇప్పటి వరకు కోహ్లి 74 సెంచరీలు సాధించిన విషయం తెలిసిందే. ఇందులో వన్డేల్లో 46, టెస్టుల్లో 27, టీ20లో ఒక శతకం ఉన్నాయి.
కాగా గతేడాది డిసెంబరులో బంగ్లాదేశ్ పర్యటనలో భాగంగా కోహ్లి ఆఖరి వన్డేలో సాధించిన సెంచరీ చివరిది. ఇక ఆసీస్‌తో టెస్టుల్లో కోహ్లి బ్యాట్ ఝులిపించాలని అభిమానులు కోరుకున్నప్పటికీ ఇంతవరకు ‘కింగ్’ స్థాయి స్కోరు నమోదు కాలేదు.
అంతేకాదు టెస్టుల్లో కోహ్లి సెంచరీ చేసి దాదాపు మూడున్నరేళ్లు దాటింది. కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో బంగ్లాదేశ్‌తో రెండో టెస్టులో ఆఖరిసారి శతకం బాదాడు. 136 పరుగులు సాధించాడు.
కోహ్లిపై ఐస్‌లాండ్ క్రికెట్ ట్వీట్.. పిచ్చి పిచ్చి పోస్టులు పెడితే
ఈ నేపథ్యంలో ఐస్‌లాండ్ క్రికెట్.. ‘‘ఈ గణాంకాలు భారత అభిమానులకు అంతగా రుచించకపోవచ్చు. కానీ విరాట్ కోహ్లి గత 23 టెస్టుల్లో ఇంత వరకు సెంచరీ సాధించిందే లేదు. ఆఖరిసారి 2019లో శతకం బాదాడు. చాలా కాలం.. అంటే చాలా కాలం అయిపోయింది కదా?’’ అని గురువారం ట్వీట్ చేసింది.
దీంతో టీమిండియా ఫ్యాన్స్‌కు చిర్రెత్తిపోయింది. ఐస్‌లాండ్ క్రికెట్‌పై భగ్గుమంటున్నారు. ‘‘ఇలాంటి పిచ్చి పిచ్చి పోస్టులు పెడితే అస్సలు బాగోదు. బోర్డర్- గావస్కర్ ట్రోఫీ రెండో టెస్టులో కోహ్లి చేసిన 44 పరుగులు సెంచరీ కంటే విలువైనవి.
ఇక మీరు అడిగిన చెత్త ప్రశ్నకు మా సమాధానం ఏంటంటే.. కింగ్ కోహ్లి ఎప్పటికీ కింగ్‌కోహ్లినే! అర్థమైందా’’ అంటూ చురకలు అంటిస్తున్నారు. త్వరలోనే కోహ్లి సెంచరీ సాధిస్తాడు, అప్పుడు ఏమని ట్వీట్ చేస్తారో! అయినా ఇంతకీ మీకా అర్హత ఉందంటారా? అని ట్రోల్ చేస్తున్నారు.
చదవండి: తండ్రుల కాలం అయిపోయింది, కొడుకులు తయారయ్యారు.. సౌతాఫ్రికా-విండీస్ మ్యాచ్‌లో ఆసక్తికర పరిణామం
ICC Rankings: ఆండర్సన్ ప్రపంచ రికార్డు! మళ్లీ ఎవరికీ సాధ్యం కాదేమో! అశ్విన్‌తో పొంచి ఉన్న ప్రమాదమిదే!
This statistic won't please many of our Indian fans, but it is now 23 Tests since Virat Kohli scored a century, which was back in 2019. How long is too long?
— Iceland Cricket (@icelandcricket) February 21, 2023
You wouldn’t be publishing this rubbish if you saw his 44 against Australia in the second BGT test at Dehi. Worth more than many a century! And to answer your question, since this involves 👑 Kohli, ‘as long as it takes’ #KingKohli
— Somesh Dwivedi (@someshdwived) February 21, 2023
Comments
Please login to add a commentAdd a comment