పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజమ్‌కు ఘోర అవమానం జరిగింది. క్రికెట్ ఐస్‌లాండ్ (సీఐ).. తాజాగా ప్రకటించిన పాకిస్తాన్ ఆల్‌టైమ్ వన్డే టీమ్‌లో బాబర్ పేరును డ్రింక్స్ బాయ్స్ జాబితాలో చేర్చింది. బాబార్‌తో పాటు మహ్మద్ హఫీజ్, షోయబ్ మాలిక్ పేర్లను కూడా క్రికెట్ ఐస్‌లాండ్ డ్రింక్స్ బాయ్స్ జాబితాలో చేర్చింది.
ఈ జట్టులో ఓపెనర్లుగా సయీద్ అన్వర్, జహీర్ అబ్బాస్‌లకు స్థానం కల్పించిన క్రికెట్ ఐస్‌లాండ్.. వన్‌డౌన్‌లో ఇంజమామ్ ఉల్ హాక్, నాలుగో స్థానంలో జావిద్ మియాందాద్, ఐదో ప్లేస్‌లో మహ్మద్ యూసఫ్, ఆరో స్థానంలో ఇమ్రాన్ ఖాన్, ఏడో స్థానంలో షాహిద్ అఫ్రిది, ఆతర్వాత మొయిన్ ఖాన్ (వికెట్‌కీపర్), పేస్ బౌలర్ల కోటాలో వసీం అక్రమ్, వకార్ యూనిస్, ఏకైక స్పెషలిస్ట్ స్పిన్నర్‌గా సక్లయిన్ ముస్తాక్‌లను ఎంపిక చేసింది.
Today we announce our Pakistani ODI team of all time:
— Iceland Cricket (@icelandcricket) January 8, 2023
S Anwar
Z Abbas
I Ul Haq
J Miandad
M Yousuf
I Khan (c)
S Afridi
M Khan (WK)
W Akram
W Younas
S Mushtaq
Drinks boys: B Azam, M Hafeez and Shoaib Malik
క్రికెట్ ఐస్‌లాండ్.. ఈ జట్టుకు కెప్టెన్‌గా పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌ను ఎంపిక చేసింది. ఈ విషయాన్ని క్రికెట్ ఐస్‌లాండ్ కొద్ది గంటల ముందు (జనవరి 8) తమ అధికారిక ట్విటర్ ద్వారా వెల్లడించింది.
కాగా, బాబర్ ఆజమ్ సారధ్యంలోని పాకిస్తాన్ క్రికెట్ టీమ్ ఇటీవలి కాలంలో వరుస పరాజయాల బాట పట్టిన విషయం తెలిసిందే. టీ20 వరల్డ్‌కప్-2022 ఫైనల్లో ఇంగ్లండ్ చేతిలో ఓటమి అనంతరం స్వదేశంలో ఇంగ్లండ్ చేతిలో టెస్ట్ సిరీస్‌ను 0-3 తేడాతో కోల్పోయిన బాబర్ సేన.. ఆతర్వాత స్వదేశంలోనే న్యూజిలాండ్‌తో జరిగిన 2 మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌ను అతికష్టం మీద 0-0తో డ్రా చేసుకోగలిగింది.
ఈ సిరీస్‌లోనూ రెండు మ్యాచ్‌ల్లో ఓటమి అంచుల దాకా వచ్చిన పాక్ అతికష్టం మీద బయటపడగలిగింది. స్వదేశంలో వరుస పరాజయాల నేపథ్యంలో పాక్ అభిమానులు బాబర్ ఆజమ్‌పై దుమ్మెత్తిపోస్తున్నారు. బాబర్.. కేవలం రికార్డుల కోసమే మ్యాచ్‌లు ఆడతాడు, జట్టు జయాపజాలతో సంబంధం లేనట్లు వ్యవహరిస్తాడని తీవ్రస్థాయిలో విమర్శిస్తున్నారు. ఈ నేపథ్యంలో క్రికెట్ ఐస్‌లాండ్ బాబర్‌ను డ్రింక్స్ బాయ్‌గా పేర్కొనడం చర్చనీయాంశంగా మారింది.
Comments
Please login to add a commentAdd a comment