వన్డే వరల్డ్‌కప్-2023కి సంబంధించి ఐస్‌ల్యాండ్ క్రికెట్ తమ ఫేవరెట్ (వరల్డ్ ఎలెవెన్) జట్టును ప్రకటించింది. లీగ్ దశలో అత్యుత్తమ ప్రదర్శన కనబర్చిన ఆటగాళ్లకు ఐస్‌ల్యాండ్ క్రికెట్ తమ జట్టులో చోటు కల్పించింది. ఇందులో ఏకంగా ఐదుగురు భారత క్రికెటర్లకు చోటు దక్కడం విశేషం. ఈ జట్టుకు కెప్టెన్‌గా రోహిత్ శర్మ ఎంపిక చేయబడగా.. విరాట్ కోహ్లి, రవీంద్ర జడేజా, జస్ప్రీత్ బుమ్రా, మొహమ్మద్ షమీలకు సభ్యులుగా చోటు దక్కింది.
We have seen enough. It's time to announce our World XI from the CWC group stage. Discuss.
— Iceland Cricket (@icelandcricket) November 8, 2023
R Sharma (c)
Q de Kock (wk)
V Kohli
R Ravindra
D Mitchell
G Maxwell
R Jadeja
M Jansen
A Zampa
J Bumrah
M Shami
ఈ జట్టుకు వికెట్‌కీపర్‌గా దక్షిణాఫ్రికా ఆటగాడు క్వింటన్ డికాక్ ఎంపిక చేయబడగా.. న్యూజిలాండ్ రచిన్ రవీంద్ర, డారిల్ మిచెల్ (న్యూజిలాండ్), గ్లెన్ మ్యాక్స్‌వెల్ (ఆస్ట్రేలియా), మార్కో జన్సెన్ (దక్షిణాఫ్రికా), ఆడమ్ జంపా (ఆస్ట్రేలియా) ఇతర సభ్యులుగా చోటు దక్కించుకున్నారు. ఈ జట్టులో కేవలం నాలుగు జట్లకు మాత్రమే ప్రాతినిథ్యం లభించింది. భారత్ నుంచి ఐదుగురు, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా నుంచి తలో ఇద్దరు ఈ జట్టుకు ఎంపికయ్యారు. ఈ ఆటగాళ్లంతా ప్రస్తుత ప్రపంచకప్‌లో ప్రఛండమైన ఫామ్‌లో ఉన్నారు. ఈ జట్టును గనక వరల్డ్‌కప్ బరిలో దించితే ఎంతటి మేటి జట్టునైనా మట్టికరిపించగలదు.
ఐస్‌ల్యాండ్ క్రికెట్ ప్రకటించిన ఈ జట్టులో ఆసీస్ స్టార్ ఆటగాడు డేవిడ్ వార్నర్‌కు స్థానం లభించకపోవడం విశేషం. పై పేర్కొన్న అందరు ఆటగాళ్లలాగే వార్నర్ సైతం ప్రస్తుత ప్రపంచకప్‌లో భీకరఫామ్‌లో ఉన్నాడు. ఇప్పటివరకు జరిగిన మ్యాచ్‌ల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో టాప్-7 బ్యాటర్లకు చోటు కల్పించిన ఐస్‌ల్యాండ్ క్రికెట్ ఒక్క డేవిడ్ వార్నర్‌ను మాత్రమే విస్మరించింది. జట్టు కూర్పు విషయాన్ని దృష్టిలో పెట్టుకుని వారు ఈ నిర్ణయం తీసుకుని ఉండవచ్చు. అలాగే బౌలర్ల విషయంలోనూ షాహీన్ అఫ్రిదికి చోటు కల్పించి ఉండాల్సిందని పాక్ క్రికెట్ అభిమానులు అభిప్రాయపడుతున్నారు.
ఐస్‌ల్యాండ్ క్రికెట్ ప్రకటించిన వరల్డ్ ఎలెవన్ జట్టు.. ప్రస్తుత వరల్డ్‌కప్‌లో ఆయా ఆటగాళ్ల ప్రదర్శన
- రోహిత్ శర్మ (కెప్టెన్)- 8 మ్యాచ్‌ల్లో సెంచరీ, 2 హాఫ్ సెంచరీల సాయంతో 442 పరుగులు
- క్వింటన్ డికాక్ (వికెట్‌కీపర్)- 8 మ్యాచ్‌ల్లో 4 సెంచరీల సాయంతో 550 పరుగులు
- విరాట్ కోహ్లి- 8 మ్యాచ్‌ల్లో 2 సెంచరీలు, 4 హాఫ్ సెంచరీల సాయంతో 543 పరుగులు
- రచిన్ రవీంద్ర- 8 మ్యాచ్‌ల్లో 3 సెంచరీలు, 2 హాఫ్ సెంచరీ సాయంతో 523 పరుగులు
- డారిల్ మిచెల్- 8 మ్యాచ్‌ల్లో సెంచరీ, 2 హాఫ్ సెంచరీల సాయంతో 375 పరుగులు
- గ్లెన్ మ్యాక్స్‌వెల్- 7 మ్యాచ్‌ల్లో 2 సెంచరీల సాయంతో 397 పరుగులు
- రవీంద్ర జడేజా- 8 మ్యాచ్‌ల్లో 14 వికెట్లు
- మార్కో జన్సెన్- 8 మ్యాచ్‌ల్లో 17 వికెట్లు
- ఆడమ్ జంపా- 8 మ్యాచ్‌ల్లో 20 వికెట్లు
- జస్ప్రీత్ బుమ్రా- 8 మ్యాచ్‌ల్లో 15 వికెట్లు
- మొహమ్మద్ షమీ- 4 మ్యాచ్‌ల్లో 16 వికెట్లు
Comments
Please login to add a commentAdd a comment