volcanic eruptions
-
తరుముకొస్తున్న ఉత్పాతం
అమెరికాలో అతి పెద్దదైన కిలోవెయా అగ్నిపర్వతం సోమవారం బద్దలైంది. విస్ఫోటనం ధాటికి అగ్నిపర్వతం నుంచి ఏకంగా 80 మీటర్ల ఎత్తుకు పైగా లావా ఎగసిపడుతోంది. ఇది కేవలం ట్రైలర్ మాత్రమేనని, అతి త్వరలో అంతకు మించి భారీ స్థాయిలో అగ్నిపర్వత విస్ఫోటం తప్పకపోవచ్చని జియాలజిస్టులు అంచనా వేస్తున్నారు. ‘‘అదెక్కడన్నది ఇప్పటికిప్పుడు స్పష్టం కావడం లేదు. కానీ ముప్పు పొంచి ఉందన్నది మాత్రం సుస్పష్టం’’అని చెబుతున్నారు. దాని దెబ్బకు ప్రపంచమంతా అతలాకుతలం కావడం ఖాయమని హెచ్చరిస్తున్నారు. పర్యావరణ సమస్యలు మొదలుకుని ఆహార కొరత దాకా మానవాళికి కొన్నేళ్ల పాటు అన్నివిధాలా కనీవినీ ఎరగని కష్టనష్టాలు తప్పకపోవచ్చంటున్నారు. ప్రపంచంలో ఏదో ఒక మూలన జరిగే అగ్నిపర్వత పేలుడు మొత్తం ప్రపంచాన్ని ఇంతగా ఎలా ప్రభావితం చేస్తుందంటే నమ్మశక్యంగా అనిపించకపోవచ్చు. కానీ, వినడానికి ఆశ్చర్యంగా అనిపించినా పచ్చి నిజమిది’’అని సైంటిస్టులు చెబుతున్నారు...! అది 1815. ఇండోనేసియాలోని మౌంట్ తంబోరా అగ్నిపర్వతం ఉన్నట్టుండి బద్దలైంది. ఎంతలా అంటే, మానవాళి చరిత్రలో ఇప్పటిదాకా నమోదైన అతి భారీ విస్ఫోటంగా అది రికార్డుల్లో నిలిచిపోయింది. ఆ తీవ్రత ధాటికి భారీ పరిమాణంలో ఎగిసిపడ్డ దుమ్ము, ధూళి రేణువులు తదితరాలు వాతావరణంలో కిలోమీటర్ల ఎత్తున, అత్యంత విస్తారంగా పరుచుకుపోయాయి. భూమిని చేరే సూర్యరశ్మిని అవి అడ్డుకున్నాయి. దాంతో ఉత్తరార్ధ గోళంలో ఉష్ణోగ్రతలు ఏకంగా ఒక డిగ్రీకి పైగా పడిపోయాయి. ఆ ఏడాది ఆ ప్రాంతంలో ఎక్కడా వేసవే లేకుండా పోయింది. ఫలితంగా వానలు ముఖం చాటేయడంతో పంటలు తీవ్రంగా దెబ్బతిని దిగుబడి భారీగా తగ్గిపోయింది. దేశాలకు దేశాలే తిండికి అలమటించిపోయాయి. ఎటు చూసినా కరువు మరణాలే అన్నట్టుగా తయారైంది. వాతావరణ మార్పుల కారణంగా కలరా వంటి మహమ్మారులు విజృంభించి మరింత భారీ ప్రాణ నష్టానికి కారణమయ్యాయి. ఇదంతా కేవలం ఒకే ఒక్క అగ్నిపర్వత విస్ఫోటం చేసిన నష్టం. అందుకే, త్వరలోనే అలాంటి విస్ఫోటానికి ప్రకృతి రంగం సిద్ధం చేసుకుంటోందన్న జియాలజిస్టుల హెచ్చరికలు వణుకు పుట్టిస్తున్నాయి. అందుకు ఆరింట ఒక శాతం అవకాశమున్నట్టు జెనీవా యూనివర్సిటీ పర్యావరణ శాస్త్రవేత్త మార్కస్ స్టొఫెల్ అంచనా వేశారు. ‘‘ఈసారి జరగబోయే పర్యావరణ విధ్వంసం అంచనాకు కూడా అందనిది. పైగా ఈ విపత్తును ఎదుర్కోవడానికి మన దగ్గర ఎలాంటి ప్రణాళికా లేకపోవడం మరింత గుబులు పుట్టించే అంశం’’అంటూ వాపోయారు. అంతేకాదు, ‘‘1815తో పోల్చుకుంటే ఈసారి జరగబోయే నష్టం అంచనాలకు కూడా అందని స్థాయిలో ఉంటుంది’’అని అభిప్రాయపడ్డారు. ఏం జరుగుతుంది? అగ్నిపర్వతాలు బద్దలైనప్పుడు భారీగా లావాను వెదజల్లుతాయన్నది తెలిసిందే. దాంతోపాటు అత్యంత భారీ పరిమాణంలో బూడిదతో పాటు పలు రకాల వాయువులు కూడా విడుదలవుతాయి. వాటిలో సల్ఫర్ డయాక్సైడ్ చేసే హాని అంతా ఇంతా కాదు. పేలుడు తీవ్రత చాలా ఎక్కువగా ఉన్నప్పుడు ఇది ఏకంగా వాతావరణానికి మాతృ స్థానమైన ట్రోపోస్పియర్ దాకా చేరుతుంది. దాని దిగువన, అంటే భూమికి దాదాపు 7 మైళ్ల ఎత్తున ఉండే స్ట్రాటోస్పియర్లో భారీగా పరుచుకుని ఏరోసెల్ అణువుల పుట్టుకకు దారితీస్తుంది. అవి సూర్యరశి్మని అడ్డుకుని దాన్ని భూమికి చేరకుండా అంతరిక్షంలోకే తిప్పి పంపుతాయి. ఫలితంగా భూమి చల్లబడుతుంది. ఈ అణువులు కనీసం రెండేళ్లపాటు వాతావరణంలో అలాగే ఉండిపోతాయి. 1991లో ఫిలిప్పీన్స్‌లో మౌంట్ పినాటుబో అగ్నిపర్వత పేలుడు వల్ల దాదాపు 1.5 కోట్ల టన్నుల సల్ఫర్ డయాక్సైడ్ వాతావరణంలోకి విడుదలైందని అంచనా. దాని దెబ్బకు ప్రపంచవ్యాప్తంగా వాతావరణం 0.5 డిగ్రీ సెల్సియస్ మేరకు చల్లబడిపోయింది. 1815 తరహావి, అంతకు మించిన భారీ అగ్నిపర్వత పేలుళ్లు సంభవిస్తే భూమి ఏకంగా 1.5 డిగ్రీల దాకా చల్లబడిపోయే ఆస్కారముంది. అదే జరిగితే ఈసారి నష్టతీవ్రత మరింత భారీగా ఉంటుందని న్యూయార్క్ యూనివర్సిటీ ప్రొఫెసర్ మైకేల్ రాంపినో అన్నారు. ‘‘ప్రస్తుతం రికార్డులు బద్దలు కొట్టే స్థాయిలో నమోదవుతున్న ఉష్ణోగ్రతలే అందుకు కారణం. వేడి వాతావరణంలో ఏరోసెల్ అణువులు మరింత చిన్న పరిమాణంలో ఏర్పడతాయి. దానికి తోడు వాతావరణపు పై పొరల్లో శరవేగంగానూ, సుదూరాలకూ పయనిస్తాయి. దాంతో సూర్యరశి్మని అవి మరింత ఎక్కువగా అడ్డుకుని భూ వాతావరణాన్ని గణనీయంగా చల్లబరుస్తాయి’’అని వివరించారు. గ్లోబల్ వారి్మంగ్‌తో సతమతమవుతున్న నేపథ్యంలో ఇది మంచిదే కదా అనిపించడం సహజం. కానీ ఇది మరీ విపత్కర పరిణామాలకు బాటలు వేస్తుందని రాంపినో హెచ్చరించారు. ‘‘క్రీస్తుపూర్వం 43లో అలస్కాలోని ఓక్మోక్ అగ్నిపర్వతం బద్దలైన కారణంగా దక్షిణ యూరప్, ఉత్తర ఆఫ్రికా ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు ఏకంగా 7 డిగ్రీల సెల్సియస్ దాకా పడిపోయాయి. ఆ దెబ్బకు ఆహారోత్పత్తి దాదాపుగా పడకేసింది. ఆ ప్రాంతాల్లోని దేశాలన్నీ నరకం చవిచూశాయి. నాటితో పోలిస్తే ఇప్పుడు జనాభా ఊహాతీతంగా పెరిగింది. ప్రపంచవ్యాప్తంగా ఏకంగా 80 కోట్ల పైచిలుకు జనాభా చురుగ్గా ఉన్న అగ్నిపర్వతాలకు కేవలం 60 మైళ్ల దూరంలోనే విస్తరించి ఉంది’’ అని చెప్పారాయన. ‘‘కనుక చల్లని వాతావరణం ప్రపంచ ఆహారోత్పత్తిలో కీలకపాత్ర పోషించే భారత్‌తో పాటు అమెరికా, చైనా వంటి దేశాలపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది. దేశాలన్నీ ఆహార సంక్షోభంతో అల్లాడుతాయి’’అని ఆందోళన వెలిబుచ్చారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
ఐస్లాండ్లో అగ్నిపర్వతం విస్ఫోటనం..ఆందోళన చెందుతున్న ప్రజలు (ఫొటోలు)
-
Iceland: అగ్ని పూలు
ఐస్లాండ్ దేశంలోని గ్రాండావ్ సిటీ సమీపంలోని అగ్నిపర్వతం బద్దలై భారీ ఎత్తున దుమ్ము, ధూళి, లావాలను వెదజల్లుతున్న దృశ్యం. డిసెంబర్ నుంచి ఈ సిలింగర్‌ఫెల్ అగ్నిపర్వతం బద్దలవడం వరసగా ఇది మూడోసారి. దీంతో దగ్గర్లోని బ్లూ లాగూన్ స్పా పరిసర ప్రజలను అక్కడి నుంచి ఖాళీచేయించారు. గత శుక్రవారం నుంచి ఇక్కడ వందలాది చిన్నపాటి భూకంపాలు సంభవించాయి. తర్వాత ఇలా ఒక్కసారిగా అగ్నిపర్వత బిలం బద్దలై వందల మీటర్ల ఎత్తుకు దుమ్ము, ధూళిని ఎగజిమ్మింది. దీంతో తీరనగరం గ్రాండావ్ లోని స్థానికులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. -
అగ్ని పర్వతం బద్దలైనప్పుడు...
ఆకాశంలో చుక్కల ముగ్గేసినట్లు నక్షత్రాలు.. మధ్యలో ఒక్కసారిగా పేలిన కొలిమా అగ్ని పర్వతం.. ఫొటో సూపర్‌గా ఉంది కదూ.. ఈ చిత్రాన్ని హెర్నాండో రివేరా అనే ఫొటోగ్రాఫర్ తీశారు. గతంలో మెక్సికోలోని కొలిమా అగ్ని పర్వతం బద్దలైనప్పుడు ఓ రాత్రంతా అక్కడే ఉండి ఫొటోలను తీసినట్లు రివేరా తెలిపారు. ఒక్కోసారి ప్రకృతి విధ్వంసం కూడా కెమెరా కంటికి చాలా అందంగా కనిపిస్తుందని చెబుతున్న రివేరా ఈ చిత్రాలను తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేసుకున్నారు. భారీ డ్రోన్‌తో ఉపగ్రహ ప్రయోగాలు ఉపగ్రహాన్ని అంతరిక్షంలోకి పంపాలంటే బోలెడంత ఖర్చు. ఇస్రో లాంటి సంస్థలైతే చౌకగానే ఆ పనిచేస్తున్నాయి గానీ.. మిగిలిన చోట్ల మాత్రం ఒక్కో ప్రయోగానికి రూ.400 కోట్ల నుంచి రూ.వేల కోట్ల వరకు ఖర్చు అవుతుంటుంది. ఇలా కాకుండా.. భారీ డ్రోన్ సాయంతో తక్కువ ఖర్చులో ఉపగ్రహాలను కక్ష్యలోకి చేరుస్తానని అమెరికాకు చెందిన ఏవియమ్ అనే కంపెనీ చెబుతోంది. ‘రావన్ ఎక్స్’పేరుతో ఇటీవలే ఈ కంపెనీ ఓ డ్రోన్‌ను సిద్ధం చేసింది కూడా. పూర్తిగా స్వతంత్రంగా వ్యవహరించే ఈ డ్రోన్ గాలిలో నుంచే చిన్న చిన్న ఉపగ్రహాలను ప్రయోగించగలదు. 80 అడుగుల పొడవు.. రెక్కల వెడల్పు 60 అడుగులు, ఎత్తు 18 అడుగుల వరకు ఉంటుంది. సాధారణ విమాన ఇంధనాన్ని వాడుకుని 1.6 కిలోమీటర్ల రన్‌వే నుంచే నింగిలోకి ఎగరగలదు. 8 వేల చదరపు అడుగుల స్థలమున్న హ్యాంగర్‌లో ఉంచేయవచ్చు. ఎలాంటి వాతావరణంలోనైనా దీన్ని వాడుకోవచ్చని, డ్రోన్‌లో 70% మళ్లీ మళ్లీ వాడుకునేలా తయారు చేశామని కంపెనీ సీఈవో జే స్కైలస్ తెలిపారు. భవిష్యత్తులో డ్రోన్ మొత్తాన్ని పలుమార్లు వినియోగించుకునేలా చేస్తామని చెప్పారు. రావన్ ఎక్స్‌తో ఒక్కో ఉపగ్రహ ప్రయోగం 3 గంటల్లో పూర్తవుతుందన్నారు. కంపెనీ ఇప్పటికే సుమారు రూ.7 వేల కోట్ల విలువైన కాంట్రాక్టులు దక్కించుకుందని, అమెరికా స్పేస్ ఫోర్స్‌తోపాటు, ఇతర సంస్థలు వినియోగదారులుగా ఉన్నారని వివరించారు. యూఎస్ స్పేస్ ఫోర్స్ ఆస్లోన్–56 పేరుతో భూమికి దగ్గరలో ఉన్న కక్ష్యలోకి చిన్న ఉపగ్రహాలు ప్రయోగించాలని యోచిస్తున్నట్లు పేర్కొన్నారు. -
మౌంట్ సినబంగ్.. భారీ పేలుడు చూడండి
జకార్త : అగ్ని పర్వతాల రాజ్యం ఇండోనేషియాలో మరోసారి ప్రజలు వణికిపోతున్నారు. మౌంట్ సినబంగ్ అగ్నిపర్వతం బద్ధలు కావటమే ఇందుకు కారణం. సోమవారం ఇది సంభవించంగా.. ఆ ప్రభావంతో వాతావరణంలో విషవాయువుల స్థాయి తారాస్థాయికి చేరుకుంది. ఫిబ్రవరి 19న ఈ పేలుడు సంభవించింది. పేలుడు ధాటికి పర్వత రూపు రేఖల్లో సమూల మార్పులు సంభవించగా.. లావా సుమారు 5 కిలోమీటర్లపాటు ప్రయాణించింది. పర్వతం వెదజల్లిన బూడిద సుమారు 162 కిలోమీటర్ల దూరంలోని ప్రాంతంలో పడినట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో ఎవరికీ ప్రమాదం వాటిల్లలేదని ఇండోనేషియా విపత్తు నిర్వహణ శాఖ ప్రకటించింది. ఇండోనేషియాలో ఉన్న 120 అగ్ని పర్వతాలలో సినబంగ్ ఒకటి. 2010లో ఇది రగులుకోవటం ప్రారంభించింది. ఇక నాసా ఈ విధ్వంసంపై ఓ ప్రకటన విడుదల చేసింది. అగ్ని పర్వతం నుంచి వెలువడే వాయువుల్లో సల్ఫర్ డై యాక్సైడ్ పరిమాణం ఎక్కువగా ఉందని పేర్కొంది. దీంతో అధికారులు ఇళ్ల నుంచి బయటకు రాకపోవటమే మంచిదని ప్రజలకు సూచిస్తున్నారు. ఇక పేలుడు సమయంలో ఓ స్కూల్ వద్ద పిల్లలు ఆసక్తిగా గమనించటం.. మరికొందరు హహాకారాలు చేస్తున్న వీడియో ఒకటి నెట్లో వైరల్ అవుతోంది. -
మౌంట్ సినబంగ్.. భారీ పేలుడు చూడండి
-
సునామీ ఎందుకు వస్తుంది..?
జపాన్ తీర ప్రాంత గ్రామాలకు అధికారులు సునామీ హెచ్చరికలు జారీ చేశారు. తీర ప్రాంతాల్లో ఉన్న ప్రజలు ఆ ప్రాంతాలను ఖాళీ చేయాలని సూచించారు. గురువారం చిలీలో 8.3 తీవ్రతతో భూకంపం సంభవించి 11 మంది మృత్యువాత పడ్డారు. చిలీ కూడా సునామీ హెచ్చరికలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో 'సునామీ' పై క్విక్ రివ్యూ... సునామీ అంటే? Tsunami అనే పదం Tsu(Harbour), nami(waves) అనే జపాన్ పదాల కలయిక. తీరపు అల(రాకాసి అల) అని దీనర్థం. సముద్రపు అడుగు భాగంలో భూకంపాలు సంభవించడం, అగ్ని పర్వతాల ఉద్భేదనం, భూతాపాల వల్ల ఏర్పడిన అధిక శక్తి కలిగిన సముద్ర కెరటాలు తీరాన్ని చేరడాన్ని 'సునామీ'అంటారు. ఈ కెరటాలకు తరంగ దైర్ఘ్యం ఎక్కువగా ఉంటుంది. వీటి వల్ల అధిక మొత్తంలో నీరు తీరాన్ని తాకి తీవ్ర నష్టాన్ని కలిగిస్తుంది. సునామీ ఎప్పుడు వస్తుంది? భూకంప తీవ్రత 6.5 కంటే అధికంగా ఉంటే సునామీ వచ్చే ప్రమాదం ఉంది. సాధారణంగా సముద్ర గర్భంలో సునామీలు రావడానికి చాలా కారణాలున్నాయి. అయితే ఎక్కువగా భూకంపాల వల్ల 75 శాతం, అగ్ని పర్వతాల వల్ల 5 శాతం, సముద్రంలో భూతాపం వల్ల 8-10 శాతం, ఇతర కారణాల వల్ల 10 శాతం, వాతావరణంలో ప్రతికూల పరిస్థితుల వల్ల 2 శాతం సునామీలు సంభవిస్తున్నాయి. సునామీ వేగం నీటి లోతును బట్టి ఉంటుంది. 4 వేల మీటర్ల లోతులో అయితే దీని వేగం గంటకు 500- 700 కి.మీ ఉంటుంది. అదే 10 మీటర్ల నీటి లోతులో దీని వేగం గంటకు 36 కి.మీ.కు తగ్గుతుంది. సునామీ నీటి కెరటమా? సాధారణంగా సునామీలు అలలలాగే కన్పిస్తాయి. కానీ సునామీకి సాధారణ కెరటాలకు తేడా ఉంది. కెరటాలు గాలి వల్ల లేచి 5 నుంచి 20 సెకన్లలో పూర్తవుతాయి. అయితే సునామీ అలా కాదు. 5 నిమిషాల నుంచి దాదాపు గంటన్నర వరకు ఉంటుంది. సముద్రంలో కనిపించే గాలి కెరటాలు అంత లోతైనవి కావు. ఈ కెరటాలు తక్కువ వేగాన్ని కలిగి ఉంటాయి. సునామీలు అధిక వేగం కలిగి ఉండి తీవ్ర నష్టాన్ని కలిగిస్తాయి. ఉదాహరణకు 2004, 2011లో వచ్చిన సునామీల వల్ల భవనాలు, పడవలు, భారీ నిర్మాణాలు కూడా ధ్వంసమయ్యాయి.