
నిప్పులు చిమ్ముతూ...
అగ్నిపర్వతం నిప్పులు చిమ్మడం.. అందులోంచి మెరుపులు రావడం..
మెక్సికో: అగ్నిపర్వతం నిప్పులు చిమ్మడం.. అందులోంచి మెరుపులు రావడం.. ఫొటో సూపర్‌గా ఉంది కదూ. మెక్సికోలోని కొలిమా అగ్నిపర్వతం తాజాగా లావా చిమ్మడం మొదలుపెట్టినప్పుడు అధికారులు సమీప ప్రాంతాల వారందరినీ అక్కడి నుంచి తరలించారట. అయితే, కెర్నాంటెస్ అనే ఫొటోగ్రాఫర్ మాత్రం అక్కడ్నుంచి కదల్లేదు. దాదాపు 8 గంటలపాటు నిరీక్షించి మరీ.. ఈ అద్భుత చిత్రాన్ని క్లిక్‌మనిపించాడు.