జకర్తా: ఇండోనేషియాలో మరో అగ్ని పర్వతం బద్దలైంది. జకర్తాలోని గామాలామా అగ్ని పర్వతం విస్ఫోటనం చెందడంతో అక్కడ ఉన్న దేశీయ విమానాశ్రయం సుల్తాన్ బాబుల్లా తాత్కాలికంగా మూసివేసి పలు సర్వీసులు నిలిపివేశారు. దీంతో స్థానిక ప్రయాణీకులు కొంత అవస్థలు ఎదుర్కున్నారు.
వాతావరణ పరిస్థితులు అనుకూలించిన తర్వాతే విమానాశ్రయం తిరిగి తెరిచే విషయాన్ని ఆలోచిస్తామని స్థానిక రవాణాశాఖ అధికార ప్రతినిధి జేఏ బారతా తెలిపారు. గామాలామా విస్ఫోటనం మూలంగా దాదాపు 1,500 మీటర్ల మేరకు వాతావరణంలో దుమ్ముధూళి పేరుకుపోయిందని చెప్పారు. అగ్నిపర్వతం పేలిన సమయంలో ప్రకంపనలు కూడా వచ్చినట్లు అధికారులు తెలిపారు.
అగ్నిపర్వతం పేలి.. ఎయిర్ పోర్ట్ మూత
Published Thu, Jul 16 2015 4:18 PM | Last Updated on Thu, Jul 11 2019 7:48 PM
Advertisement
Advertisement