తెలంగాణ పోలీసులు లాక్‌డౌన్‌ను కఠినంగా అమలు చేస్తున్నారు. డీజీపీ మహేందర్‌రెడ్డి లాక్‌డౌన్ అమలు తీరును స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. కరోనా కాలంలో సామాన్యులకు కష్టాలు తప్పడం లేదు. అన్ని ప్రాంతాల్లో ఆంక్షలు అమల్లో ఉండటంతో జనం సతమతమవుతున్నారు. మరోవైపు కొత్త సాగు చట్టాలకు వ్యతిరేకంగా రైతు సంఘాలు ఢిల్లీలో ఆందోళన కొనసాగిస్తున్నాయి.
1/8
మధ్యప్రదేశ్ జబల్పూర్‌లో ఉదయం 4–8 గంటల మధ్యలో లాక్‌డౌన్ విరామం కావడంతో స్థానిక కూరగాయల మార్కెట్‌కు పోటెత్తిన ప్రజలు
2/8
ఖమ్మం వ్యవసాయ మార్కెట్ సోమవారం మిర్చి బస్తాలతో కళకళలాడింది. కరోనా నేపథ్యంలో 20 రోజుల పాటు మూసి ఉంచిన మార్కెట్‌ను సోమవారం పునఃప్రారంభించగా..దాదాపు 60 వేల మిర్చి బస్తాలు విక్రయానికి వచ్చాయి. రైతులు ప్రధానంగా తేజ రకం మిర్చిని ఎక్కువగా తీసుకురాగా.. క్వింటాలుకు గరిష్టంగా రూ.13వేల ధర పలికింది. ఖమ్మం జిల్లాతో పాటు భద్రాద్రికొత్తగూడెం, మహబూబాబాద్, వరంగల్ రూరల్, సూర్యాపేట, నల్లగొండ జిల్లాల నుంచి, అలాగే ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా, గుంటూరు జిల్లాల నుంచి రైతులు మిర్చిని విక్రయించేందుకు తీసుకొచ్చారు. పెద్ద ఎత్తున రైతులు పంటను తీసుకురావడంతో చాలా రోజుల తర్వాత మార్కెట్ కళకళలాడింది.
3/8
కోవిడ్ కట్టడిలో భాగంగా అమలవుతున్న లాక్‌డౌన్ సమయంలో తెలంగాణ–ఏపీ సరిహద్దుల్లో సోమవారం వాహనాల రద్దీ పూర్తిగా తగ్గిపోయింది. అయితే పోలీసుల తనిఖీల కారణంగా చెక్‌పోస్టుల వద్ద వాహనాలు బారులు తీరుతున్నాయి. పుల్లూరు టోల్‌ప్లాజా సరిహద్దు చెక్‌పోస్టు వద్ద భారీగా నిలిచిన వాహనాలను ఈ ఫొటోలో చూడొచ్చు.
4/8
కరోనా వల్ల ఆక్సిజన్ అందక ఉక్కిరిబిక్కిరై ఎన్నో ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి. స్వీయ రక్షణ చర్యలే శరణ్యమని, భౌతిక దూరం పాటించాలని, అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని ప్రభుత్వం, పోలీసులు నెత్తీనోరూ కొట్టుకున్నా.. ప్రజల్లో మార్పు రావడం లేదు. విజయవాడలో ఆదివారం ఇలా ఆటోల్లో కిక్కిరిసి వెళ్తున్న వీరిని చూడండి.. ఏమాత్రం భయం లేకుండా ఎలా వెళ్తున్నారో.. సాధారణ రోజుల్లోనే ఆటోలో ఇంతమంది ప్రయాణించడం ప్రమాదకరం.. ప్రస్తుత విపత్కర పరిస్థితుల్లోనూ ఇలా కిక్కిరిసి వెళ్లడం చావును కొనితెచ్చుకోవడమే కాదూ..! అన్నా.. నీ కుటుంబానికి నీవే ఆదరువు.. తస్మాత్ జాగ్రత్త..! – సాక్షి ఫొటో గ్రాఫర్, విజయవాడ
5/8
పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు ప్రభుత్వాస్పత్రిలో ఆక్సిజన్ కాన్సన్ ట్రేటర్స్‌ను స్వయంగా పరీక్షిస్తున్న ఆంధ్రప్రదేశ్ వెద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని
6/8
లాక్‌డౌన్ కఠినంగా అమలు చేయాలని ప్రభుత్వం ఆదేశించడంతో పోలీసు శాఖ తీవ్రంగా శ్రమిస్తోంది. ఈ మేరకు డీజీపీ మహేందర్‌రెడ్డి గత మూడు రోజులుగా పరిస్థితిని స్వయంగా సమీక్షిస్తున్నారు. నగరంలోని పలు ప్రాంతాల్లో క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నారు. లాక్‌డౌన్ అమలు తీరును అడిగి తెలుసుకుంటున్నారు. అలాగే హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ సీపీలు సైతం క్షేత్రస్థాయికి వెళ్తున్నారు. తనిఖీలు చేపడుతున్నారు.
7/8
ఈ నెల 26న రైతులు తలపెట్టిన బ్లాక్‌డే నిరసన సందర్భంగా పంజాబ్ నుంచి పెద్ద ఎత్తున రైతులు ఢిల్లీ సరిహద్దులకు చేరుకుంటున్నారు. హిసార్‌లో సోమవారం నిరసన తెలుపుతున్న రైతు సంఘాల సభ్యులు.
8/8
కాంగోలోని న్యిరాగోంగ్ అగ్ని పర్వతం బద్దలై లావా ప్రవాహం సమీపంలోని గోమా నగర శివారులోని నివాస ప్రాంతాలను ముంచెత్తింది. 500 ఇళ్లు ధ్వంసం కాగా, 15 మంది ప్రాణాలు కోల్పోయారు.
Comments
Please login to add a commentAdd a comment