
కరోనా కష్టాలు ఇప్పట్లో తొలగిపోయేలా కనిపించడం లేదు. కోవిడ్ పరీక్షలు, వ్యాక్సిన్ల కోసం ప్రజలు అవస్థలు పడాల్సివస్తోంది. కరోనా బాధితులకు ఆస్పత్రుల్లో బెడ్‌లు దొరక్క తమ ఇళ్ల దగ్గరే ఏర్పాట్లు చేసుకుంటున్నారు. మరోవైపు కరోనా కట్టడికి తెలంగాణలో లాక్‌డౌన్ కొనసాగుతోంది.

జోగుళాంబ గద్వాల జిల్లా పుల్లూరు టోల్‌ప్లాజా సరిహద్దు చెక్‌పోస్ట్ వద్ద శుక్రవారం ఉదయం ఏపీ నుంచి వచ్చిన అంబులెన్సులను ఆపుతున్న తెలంగాణ పోలీసులు

తెలంగాణలో లాక్‌డౌన్ సడలింపు సమయంలో శుక్రవారం ఉదయం 9 గంటల ప్రాంతంలో నల్లగొండ ఫ్లై ఓవర్ బ్రిడ్జిపై మెల్లగా కదులుతున్న వాహనాలు

నల్లగొండ జిల్లా అడవిదేవులపల్లి మండలం కొత్తనందికొండ గ్రామానికి చెందిన రమావత్ శివకు కరోనా సోకడంతో పదిరోజులుగా చెట్టుమీద మంచే కట్టుకుని ఐసోలేషన్‌లో గడుపుతున్నాడు.

లాక్‌డౌన్ నిబంధనలు ఉల్లంఘించి రహదారులపైకి వస్తున్న వాహనదారులను కనిపెట్టేందుకు హైదరాబాద్ పోలీసులు కెమెరాలను వినియోగిస్తున్నారు. శుక్రవారం దిల్‌షుఖ్‌నగర్‌లో వాహనదారులను కానిస్టేబుల్ కెమెరా తీస్తున్న దృశ్యం.

ఏదో రేషన్ సరుకుల కోసం కార్డులు క్యూలో పెట్టారనుకుంటున్నారా.. కాదండోయ్.. కరోనా వ్యాక్సిన్ కోసం వచ్చిన తంటా ఇది. సూర్యాపేట జిల్లా చిలుకూరులో వ్యాక్సినేషన్ కోసం ఆధార్ కార్డులను ఇలా క్యూలో పెట్టారు. నర్సాపూర్ ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలో కరోనా టెస్టు కేంద్రం వద్ద క్యూలో ఆధార్‌కాపీలు పెట్టిన ఫొటో కూడా ఇక్కడ చూడొచ్చు.

రంజాన్ పర్వదినం సందర్భంగా శుక్రవారం హైదరాబాద్‌లోని చార్మినార్ వద్ద ముస్లిం యువకుల ఆలింగనాలు. ఒకరికొకరు పండగ శుభాకాంక్షలు అందజేసుకున్నారు.

శుక్రవారం బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలోని బైతుల్ ముకర్రం మసీదులో రంజాన్ ప్రార్థనలు చేస్తున్న ముస్లింలు

కోల్‌కతాలో ఓ వ్యక్తి నీళ్ల క్యానును తీసుకెళ్తుండగా తమాషాగా కావడికి వేలాడుతూ అతని కూతురు ఉత్సాహం

అక్షయ తృతీయ పవిత్ర దినాన్ని పురస్కరించుకుని కోల్‌కతాలో ఓ వ్యాపారి తన అకౌంట్ పుస్తకంపై స్వస్తిక గుర్తును రాస్తున్న దృశ్యం
Comments
Please login to add a commentAdd a comment