
ఈ చిత్రాల్లో కామన్ పాయింట్ క్యూ. అన్ని ఫొటోల్లోనూ జనం బారులు తీరే ఉన్నారు. అయితే వీరి క్యూలకు కారణాలు మాత్రం వేర్వేరు. తెలంగాణ ప్రభుత్వం లాక్‌డౌన్ ప్రకటించడంతో హైదరాబాదీలు మంగళవారం ఒక్కసారిగా రోడ్డెక్కారు. కొందరు టీకాల కోసం.. కరోనా నిర్ధారణ పరీక్షల కోసం.. నిత్యవసర సరుకుల కోసం, ఊరెళ్లేందుకు బస్టాండ్లలో ఇలా ప్రజలు క్యూల్లో నిల్చున్నారు.

తెలంగాణలో లాక్‌డౌన్ ప్రకటన నేపథ్యంలో మంగళవారం మధ్యాహ్నం వరకు ఖాళీగా ఉన్న హైదరాబాద్ రోడ్లు ఒక్కసారిగా వాహనాలతో నిండిపోయాయి. చాలా ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. వైన్స్ వద్దకు పెద్ద సంఖ్యలో జనం చేరుకోవడంతో ట్రాఫిక్ జామ్ అయ్యింది. చాలా మంది సొంతూళ్లకు పయనమయ్యారు.

తెలంగాణలో లాక్‌డౌన్ విధించడంతో హైదరాబాద్‌లోని ఒక వైన్‌షాపు వద్ద బారులుతీరిన జనం. ఆదిలాబాద్‌లో మంగళవారం బైక్‌పై భారీగా మద్యాన్ని తీసుకెళ్తున్న దృశ్యం.

తెలంగాణలో లాక్‌డౌన్ ప్రకటనతో హైదరాబాద్ పాతబస్తీలో ప్రజలు ఒక్కసారిగా మార్కెట్లకు చేరుకోవడంతో చార్మినార్ పరిసర ప్రాంతాలు కిటకిటలాడాయి. దుకాణాలన్నీ వినియోగదారులతో నిండిపోయాయి.

ఉమ్మడి వరంగల్, నల్లగొండ, మహబూబ్‌నగర్, ఖమ్మం జిల్లాల్లో మంగళవారం అకాల వర్షం అతలాకుతలం చేసింది. కొనుగోలు కేంద్రాలు, కల్లాల్లో ధాన్యం తడిసిముద్దయింది. వరంగల్ రూరల్ జిల్లా గోపనపల్లిలో తడిసిన ధాన్యాన్ని చూపిస్తున్న మహిళా రైతు.

మంచిర్యాల పట్టణంలోని మార్కెట్ ఏరియాలో డ్రైనేజీలు మూసుకుపోవడంతో కాంట్రాక్టు కూలీలు ఇలా ప్రాణాలకు తెగించి వాటిని శుభ్రం చేస్తున్నారు. ఈ క్రమంలో కూలీలు పడుతున్న పాట్లు, దృశ్యాలను సాక్షి క్లిక్‌మనిపించింది. – సాక్షి ఫొటోగ్రాఫర్, మంచిర్యాల

ఈ ఫొటోలో పోలీస్ యూనిఫాంలో ఉన్న అధికారి ఏఎస్సై రాకేశ్ కుమార్(56). ఢిల్లీలో కోవిడ్ తీవ్రత నేపథ్యంలో లోథి శ్మశానవాటికలో కోవిడ్ బాధిత మృతదేహాలకు అంత్యక్రియలు నిర్వహించడంలో ఎంతగానో సాయపడుతున్నారు. ఇప్పటి వరకు 50 మృతదేహాలకు అంత్యక్రియలు జరపడంతోపాటు 1,100 మృతదేహాలకు అంత్యక్రియల్లో చేయూత అందించారు. ఈ సంక్షోభ సమయంలో తన కుమార్తె వివాహ కార్యక్రమాన్ని సైతం వాయిదా వేసుకున్నారు.

యూపీ.. ప్రయాగ్‌రాజ్‌లోని మోతీలాల్ నెహ్రూ మెడికల్ కాలేజీలో ఏర్పాటు చేసిన కోవిడ్ వ్యాక్సినేషన్ కేంద్రంలో టీకా వేయించుకుంటూ సెల్ఫీ తీసుకుంటున్న మహిళ

యూపీ.. లక్నోలో కోవిడ్ కేసులు పెరుగుతుండటంతో రహదారిపై వెళ్లే వాహనాలను సైతం శానిటైజ్ చేస్తున్న నగర పాలక సిబ్బంది
Comments
Please login to add a commentAdd a comment