
లాక్‌డౌన్ సడలింపు సమయమైన ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు హైదరాబాద్ నగర రోడ్లన్నీ జనంతో నిండిపోతున్నాయి. కొనుగోళ్లతో పాటు ఇతర అవసరాల కోసం నగర ప్రజలు ఒక్కసారిగా బయటకు వస్తున్నారు. రంజాన్ పండుగ నేపథ్యంలో చార్మినార్ వద్ద ముస్లింలు పెద్ద ఎత్తున షాపింగ్ చేయడం కనిపించింది.

లాక్‌డౌన్‌కు ముందు: బుధవారం జనంతో కిటకిటలాడుతున్న హైదరాబాద్‌లోని గుడిమల్కాపూర్ కూరగాయల మార్కెట్

జలసిరులు మోసుకెళ్తున్న మొయిళ్లు పైన.. ప్రజలను తీసుకెళ్తున్న రైలు కిందన. ఆ మబ్బుల నుంచి కూత పెట్టుకుంటూ రైలు నేల మీదకు వచ్చిందా అన్నట్టు కనిపిస్తున్న ఈ దృశ్యం శ్రీకాకుళం జిల్లా కంచిలి మండల కేంద్రంలో ఆవిష్కృతమైంది. అపురూపంగా కనిపించిన ఈ దృశ్యాన్ని స్థానికులు ఆసక్తిగా తిలకించారు. – కొత్తకోట నవీన్‌కుమార్, కంచిలి

సేమ్యా పాయసమంటే చిన్నా–పెద్దా ఎవరైనా లొట్టలేసుకుంటూ ఆరగిస్తారు. రంజాన్ పర్వదిన వేళ ముస్లిం కుటుంబాల్లో సేమ్యాపాయసం లేకుండా పండుగ జరగదు. విజయవాడ వన్‌టౌన్ ప్రాంతంలో ఈ సేమ్యాలను తయారు చేసి విక్రయిస్తున్న దృశ్యాలివి. –సాక్షి ఫొటోగ్రాఫర్, విజయవాడ

కోవిడ్ సంక్షోభంలోనూ అవిశ్రాంతంగా కష్టపడుతున్నా తమకు సరైన గుర్తింపు రావడంలేదంటూ.. వినూత్న రీతిలో నిరసన తెలుపుతున్న నర్సులు వీరంతా. అంతర్జాతీయ నర్సుల దినోత్సవం సందర్భంగా బుధవారం బెల్జియంలోని లీగే సిటీలోని ఓ ఆస్పత్రిలో తీసిందీ ఫొటో

అహ్మదాబాద్‌లోని ఓ విశాల క్రీడా మైదానంలో ‘కారులో కోవిడ్ టీకా’ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న దృశ్యం

అంతర్జాతీయ నర్సుల దినోత్సవాన్ని పురస్కరించుకుని రాజస్తాన్‌లోని బికనీర్‌లో ఒకరికొకరు సంఘీభావం తెలుపుకుంటున్న నర్సులు

ఢిల్లీలో భారీ రాజకీయ బహిరంగ సభలకు వేదికైన రామ్‌లీలా మైదానంలో 500 ఐసీయూ పడకల కోవిడ్ తాత్కాలిక ఆస్పత్రిని ఏర్పాటుచేసిన దృశ్యం. అదే ప్రాంతంలో ఉన్న చెట్టును కొట్టేయకుండా అలాగే వదిలేయడం ఫొటోలో చూడొచ్చు.
Comments
Please login to add a commentAdd a comment