అగ్నిపర్వతంపై.. ఆ ఇద్దరు మహిళలు
ప్రపంచంలోనే అరుదైన ఘనత
కరీంనగర్‌వాసికి దక్కిన అవకాశం
కరీంనగర్: దేశ చరిత్రలో అరుదైన ఘటన ఆవిష్కృతమైంది. ఆసియాఖండంలో ఏకై క అగ్నిపర్వతం అండమాన్ నికోబార్ దీవుల్లోని బెరన్ ఐలాండ్‌లో ఉంది. ఆ అగ్నిపర్వతంపై మొదటిసారిగా ఇద్దరు మహిళలు అడుగుపెట్టారు. ప్రపంచ చరిత్రలో అగ్నిపర్వతంపై అడుగుపెట్టిన మహిళలుగా చరిత్రకెక్కారు.
ఆ ఇద్దరిలో ఒకరైన మహమ్మద్ పర్వీన్ సుల్తానా కరీంనగర్‌వాసి కావడం గమనార్హం. ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ రిమోట్ సెన్సెస్, డెహ్రాడూన్, ఇస్రో వారిప్రత్యేక పరిశోధన ప్రాజెక్టులో భాగంగా డాక్టర్ మమతా చౌహాన్ ప్రధాన శాస్త్రవేత్త సారథ్యంలో వివిధ రంగాల పరిశోధకుల బృందంలో ఒకరిగా కరీంనగర్‌లోని కోతిరాంపూర్‌కు చెందిన మహమ్మద్ పర్వీన్ సుల్తానా గతనెల 29న బెరన్ ఐలాండ్‌లోని అగ్నిపర్వతంపై మొదటిసారిగా అడిగీడారు.
పరిశోధనలో భాగంగా అగ్నిపర్వతం భౌగోళిక పరిణామాలు, శాసీ్త్రయవిశ్లేషణ, అగ్నిపర్వత ప్రకృతి విపత్కర పరిస్థితులపై అంచనా, అవగాహనకు అక్కడ లభించిన నమూనాలను సేకరించారు. ఐలాండ్‌లోని డిగ్లీపూర్ నుంచి రంగౌత్ వరకు సుమారు వంద కిలోమీటర్లకు పైగా వివిధ ప్రాంతాలలో ఉన్న మడ్ వోల్కనోవాలను పరిశీలించి నమూనాలు సేకరించారు.
Comments
Please login to add a commentAdd a comment