హవాయి : అగ్నిపర్వతం పేలితే ఎలా ఉంటుందో ఇప్పటి వరకూ చాలా మంది పుస్తకాల్లో చదివి ఉంటారు. మరికొందరు సినిమాల్లోనో చూసి ఉంటారు. కానీ ఇప్పుడు రోజులు మారాయి. టెక్నాలజీ పెరిగింది. ఎక్కడ ఏం జరుగుతుందో క్షణాల్లో తెలుసుకుంటున్నారు. అలాగే హవాయి దేశంలోని కిలౌయి లోని అగ్నిపర్వతం పేలడం.. అది సృష్టించిన విధ్వంసం వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ సంఘటనలో సుమారు 2వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. వందల సంఖ్యలో ఇళ్లు, భవనాలు, క్షణాల్లో బూడిదై పోయాయి. అగ్ని పర్వతం నుంచి వచ్చిన లావా గాల్లో సుమారు 70 మీటర్ల ఎత్తుకు ఎగసి పడుతోంది. అంతేకాకుండా దీని కారణంగా చుట్టు పక్కల ప్రాంతాల్లో భూకంపం సంభవించింది. లావా ఎలా పరుగులెడుతుందో చూడండి. దారి పక్కన నిలిపిఉన్న కారును క్షణాల్లో కాల్చి బూడిద చేసేసింది.
పరిసర ప్రాంతాలను దగ్ధం చేస్తున్న లావా.. కాలిపోతున్న గృహాలు
రోడ్డుపై ప్రవహిస్తున్స లావా
Comments
Please login to add a commentAdd a comment