అగ్నిపర్వతంపై ఏలియన్లు | Unidentified flying object spotted at Yellowstone Volcano | Sakshi
Sakshi News home page

గ్రహాంతర వాసులకు ఏమి కాదా.!

Published Sat, Oct 7 2017 12:35 PM | Last Updated on Sat, Oct 7 2017 1:02 PM

Unidentified flying object spotted at  Yellowstone Volcano

గ్రహాంతర వాసులు భూమ్మీద మనతో పాటు తిరుగుతున్నారా? మన చుట్టూనే ఉంటున్నారా? మనిషి అడుగు పెట్టేందుకు సైతం భయపడే ప్రాంతాల్లో సంచరిస్తున్నారా? బద్దలవుతున్న అగ్నిపర్వతం.. వేగంగా ప్రవహిస్తున్న లావా మధ్యలో ఏలియన్లు ఎలా తిరగగలుగుతున్నారు? సగటు వ్యక్తి నుంచి సైంటిస్టుల వరకూ భయపెట్టే ఈ ఘటన ఎక్కడ జరిగింది? వంటి వివరాలు తెలుసుకోవాలంటే.. ఈ స్టోరీ చదవాల్సిందే.

వాషింగ్టన్‌ : అమెరికాలోని ఎల్లోస్టోన్‌ అగ్నిపర్వతం రెండునెలల కిందట బద్దలైంది. అప్పటినుంచి ఈ పర్వతం నిప్పురవ్వలను వెదజల్లుతూ.. లావా కిందకు ప్రవహిస్తోంది. అగ్నిపర్వతం వేడికి సమీప ప్రాంతాల్లోకి వెళ్లేందుకు జనాలు భయపడుతున్నారు. అకాశంలో కూడా 40 వేల అడుగుల ఎత్తులోనే ప్రయాణించడానికి సాధ్యమవుతోంది. ఈ అగ్ని పర్వతం బద్దలైన సమయంలో ఆ ప్రాంతంలో 2.3 తీవ్రతతో భూకంపం సంభవించింది.

ఇటువంటి వాతావరణ పరిస్థితుల్లో ఒక ఫ్లయింగ్‌ సాసర్‌.. అగ్నిపర్వతం, లావాకు దగ్గరగా తిరిగింది. అంతేకాక అగ్నిపర్వతం లోపలిదాకా వెళ్లడం, లావా మీద ఏవో ఆకారాలు నడుస్తున్నట్లు కనిపించింది. ఇది కచ్చితంగా మానవ జాతికి అత్యంత ప్రమాదకర సంకేతాలను పంపేదే అని సైంటిస్టులు అంటున్నారు. ఒక కాంతిపుంజం ఆకారంలోని ఆబ్జెక్ట్‌ను స్పష్టంగా వీడియోల్లో చూడవచ్చు.

ప్రస్తుతం ఇంటర్‌నెట్‌, సామాజిక మాధ్యమాల్లో హల్‌చల్‌ చేస్తున్న ఈ వీడియో జూన్‌ 9న రికార్డయినట్లు తెలుస్తోంది. ఈ ఫ్లయింగ్‌ ఆబ్జెక్ట్‌ను అగ్నిపర్వతాన్ని పరిశీలిస్తున్న శాటిలైట్‌ రికార్డ్‌ చేసినట్లు తెలుస్తోంది. జూన్‌ - ఆగస్టు మధ్య కాలంలో పలు ఫ్లయింగ్‌ ఆబ్జెక్ట్‌లను పలు శాటిలైట్లు గుర్తించాయి. ఇదిలా ఉండగా ఎల్లోస్టోన్‌ అగ్నిపర్వతం వయసును అంచనా వేయలేమని సైంటిస్టులు చెబుతున్నారు. అయితే ఈ అగ్నిపర్వతం ప్రతి 6 లక్షల సంవత్సరాలకోసారి బద్దలవుతుందని సైంటిస్టులు తెలిపారు. ఎల్లోస్టోన్‌ అగ్నిపర్వతానికి చాలా సార్లు గ్రహాంతరవాసులు టూరిస్టుల్లా వచ్చి వెళ్లారని.. ప్రముఖ సైంటిస్ట్ స్కాట్ తెలిపారు. ఎల్లోస్టోన్‌కు గ్రహాంతరవాసులకు ఉన్న సంబంధంపై పరిశోధనలు చేయాల్సిన అవసరముందని ఆయన అన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
1
1/2

2
2/2

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement