ఈ చిత్రాన్ని చూడండి.. ఓ పక్క ఉత్పాతం ఉబికి వస్తుంటే తాపీగా తనపనేదో తాను చేసుకుంటున్నాడీ రైతు. ఈ దృశ్యం ఇండోనేసియాలోని ఉత్తర సుమత్రా దీవిలో శనివారం చోటుచేసుకుంది. ఇండోనేసియాలో ఉన్న 130 క్రియాశీలక అగ్ని పర్వతాల్లో ఒకటైన షినబంగ్.. 2010 నుంచి లావా వెదజల్లుతూనే ఉంది.
దీనికి అలవాటు పడిన ప్రజలు 'నీపని నీది.. నాపని నాది' అనుకుంటూ తమ పనుల్లో నిమగ్నమైపోయారు. అయితే 400 ఏళ్ల తరువాత ఒక్కసారిగా శనివారం భారీ స్థాయిలో విస్ఫోటనం సంభవించింది. ఈ పేలుడు ధాటికి లావా, బూడిద దాదాపు 8530 అడుగుల ఎత్తుకు ఎగిసిపడ్డాయి.