హవాయి ప్రాంతంలో ఓ అగ్నిపర్వతం పేలిపోయిందని.. దాంట్లోంచి లావా చుట్టుపక్కల ప్రాంతాలను ఆక్రమిస్తోందని మనకు తెలుసు కదా.. అక్కడే ఇంకో ఆశ్చర్యకరమైన సంఘటన కూడా చోటు చేసుకుంటోంది. అగ్నిపర్వతపు పొగ, లావాల నుంచి పచ్చటి రంగు రాళ్లు వర్షంలా కురుస్తున్నాయి.
ఇంకేముంది.. హవాయి వెళ్లి కొన్ని పచ్చలు తెచ్చుకుందామని అనుకుంటున్నారా? కొంచెం ఒపిక పట్టండి. అక్కడ పచ్చల వాన కురుస్తున్న మాట వాస్తవమే అయినప్పటికీ అవి నవరత్నాల్లోని పచ్చలంత అరుదైనవి ఏమీ కాదు. ఒలివీన్ అనే సాధారణ ఖనిజంతో తయారయ్యాయి ఇవి. అగ్ని పర్వతాల ధూళిలో ఇలాంటివి కనపడటం కొంచెం అరుదు.
ఇటీవల లావా పెద్ద ఎత్తున ఆకాశంలోకి ఎగజిమ్మడంతో అక్కడి ఉష్ణోగ్రతలకు అనుగుణంగా లావాలోని రసాయనాలు ఘనీభవించి ఇలా పచ్చల్లా మారి ఉంటాయని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. వీటి విలువ మాటెలా ఉన్నప్పటికీ హవాయి ప్రజలు మాత్రం వీటిని సేకరించి జాగ్రత్త చేసుకుంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment