తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం
తిరుమల: తిరుమలలో భక్తల రద్దీ సాధారణంగా ఉంది. సర్వ దర్శనానికి భక్తులు మూడు కంపార్టుమెంట్లలో వేచి ఉన్నారు. వీరికి 5 గంటల సమయం పడుతోంది. కాలినడక భక్తులకు 2 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనానికి సుమారు 2 గంటల సమయం పడుతోంది. ఈరోజు అర్ధరాత్రి నుంచి కాలి నడక భక్తులకు దివ్యదర్శనం టోకెన్లు జారీ చేస్తారు.
వైకుంఠ ఏకాదశి, మర్నాడు ద్వాదశి సందర్భంగా దేవస్థానం అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. వైకుంఠం క్యూ కాంప్లెక్సులోని 54 కంపార్టుమెంట్లుతోపాటు నారాయణగిరి ఉద్యానవనంలో ప్రత్యేక కంపార్టుమెంట్లు ఏర్పాటు చేయనున్నారు. ఆ రెండు రోజులు (8, 9తేదీలు) ఆర్జిత సేవలను, ప్రత్యేక ప్రవేశ దర్శనాలను టీటీడీ రద్దు చేసింది. కాగా, గురువారం శ్రీవారిని 61,517మంది భక్తులు దర్శించుకున్నారు.