తిరుమల: ఆదివారం సెలవు దినం కావడంతో శ్రీవారి దర్శనార్ధం వచ్చిన భక్తులతో తిరుమలకొండ కిటకిటలాడుతోంది. వైకుంఠం క్యూకాంప్లెక్స్‌లో భక్తులు బారులుతీరారు. అన్ని కంపార్ట్‌మెంట్లు నిండిపోయాయి. శ్రీవేంకటేశ్వరస్వామి సర్వదర్శనానికి 12 గంటలు, ప్రత్యేక దర్శనానికి 2 గంటలు, కాలినడకన వచ్చే భక్తులకు 10 గంటల సమయం పడుతోంది. శనివారం శ్రీవారిని 94,392మంది భక్తులు దర్శించుకున్నట్లు టీటీడీ అధికారులు తెలిపారు.
భక్తులతో తిరుమల కొండ కిటకిట
Published Sun, Jun 19 2016 7:37 AM | Last Updated on Mon, Sep 4 2017 2:53 AM
Advertisement
Advertisement