tirumla
-
తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభం
-
శ్రీవారిని దర్శించుకున్న బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్
బాలీవుడ్ స్టార్ హీరోయిన్, అలనాటి అందాల తార దివంగత శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ తిరుమల శ్రీవారిని దర్శించుకుంది. నేడు (శుక్రవారం) జాన్వీ స్వామివారి సేవలో పాల్గొంది. విఐపీ తన స్నేహితురాలితో కలిసి మొక్కులు చెల్లించుకుంది. అచ్చమైన తెలుగమ్మాయిలా బ్లూ కలర్ లంగాఓణీలో కనిపించి ఆకట్టుకుంది. దర్శనానంతరం అర్చకులు ఆమెకు స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు. చదవండి: ప్రియుడితో పెళ్లి పీటలు ఎక్కబోతున్న బిగ్‌బాస్ బ్యూటీ! కాగా ప్రత్యేకమైన రోజుల్లో జాన్వీ తరచూ తిరుమల వచ్చి శ్రీవారిని దర్శించుకుంటుందనే విషయం తెలిసిందే. ఇటీవల ఆమె నటించి గుడ్‌లఖ్ జెర్రీ ఓటీటీలో విడుదలైన మంచి విజయం అందుకుంది. ఇక ఆమె నటించిన తాజా చిత్రం బవాల్ అనే సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధమౌవుతోంది. ఈ క్రమంలో షూటింగ్ విరామం ఇచ్చిన జాన్వీ స్వామి వారి సేవలో పాల్గనేందుకు తిరుమల వచ్చినట్లు తెలిపింది. కాగా ప్రస్తుతం ఆమె మిస్టర్ అండ్ మిస్ మహి అనే సినిమా షూటింగ్‌తో బిజీగా ఉంది. -
లోక కళ్యాణార్థం టీటీడీలో అఖండ పారాయణం
సాక్షి, తిరుపతి : లోక కళ్యాణార్థం 180 రోజులుగా టీటీడీ అఖండ పారాయణం నిర్వహిస్తుంది. శ్రీవారి ఆలయం ముందు ఉన్న నాదనీరాజన మండపంలో ఈ కార్యక్రమం జరుగుతోంది. భగవద్గీత, సుందరకాండ పారాయణం, వశిష్ట విరాట పర్వంలోని ముఖ్యమైన వాటిని మంత్రోశ్చరణ చేస్తున్నారు. ఈ సందర్భంగా టీటీడీ ఈఓ కేఎస్ జవహర్‌రెడ్డి మాట్లాడుతూ లోక కళ్యాణార్ధం ఆరు నెలలుగా అఖండ పారాయణం నిర్వహిస్తున్నామని, ఈరోజు ఆరవ అఖండ పారాయణం 20 నుంచి 24 విభాగాల్లో 128 శ్లోకాలు అఖండ పారాయణం చేశారని తెలిపారు. ప్రపంచం ప్రజలంతా సుఖ శాంతులతో ఉండాలని స్వామి వారిని ప్రార్ధిస్తూ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. 300మంది వేద పారయణ దారులు ఈకార్యక్రమంలో పాల్గొన్నారు. (శ్రీవారిని దర్శించుకున్న పలువురు ప్రముఖులు) -
అమ్మకు ఆలయం
పరిస్థితుల ప్రభావానికి, కాలగతికి ఎవరూ, ఏమీ అతీతులు కారనడానికి రూపురేఖలు కోల్పోయి, ఓనాటి వైభవానికి నిదర్శనంగా మిగిలిన ఈ ఆలయమే నిదర్శనం. కోట్లకు అధిపతి అయిన బిడ్డ ప్రపంచంలోనే అతి సంపన్న దేవుడిగా ఎదిగినా, తల్లి మాత్రం పూరిగుడిసెలో ఉంటుందనటానికి ఉదాహరణ ఆ ఆలయం. శతాబ్దాల తరబడి ధూప, దీప నైవేద్యాలకు, కనీసం భక్తులు దర్శించుకునేందుకు, ఆలన పాలనకు నోచుకోని దుస్థితిలో ఉన్న ఆలయం ఎవరిదో అనే కదా మీ సంశయం. ఇది కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీనివాసుడి తల్లి వకుళామాత ఆలయం. ప్రపంచ ప్రసిద్ధ పుణ్యక్షేత్రం తిరుపతికి కూతవేటు దూరంలో పేరూరు బండపై ఉన్న ఈ ఆలయానికి పూర్వవైభవాన్ని తిరిగి తీసుకువచ్చేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. బిడ్డ కోసం నాలుగు యుగాల నిరీక్షణ.... దేవతల తల్లి అదితి విష్ణుమూర్తి తన కొడుకుగా కావాలని తలంచింది. తన భర్తౖయెన కశ్యప ప్రజాపతితో కలిసి వేల సంవత్సరాలు తపస్సు చేయగా విష్ణుమూర్తి వామనావతారంగా అదితిదేవి గర్భంలో భాద్రపద శుక్ల ద్వాదశి నాడు జన్మించాడు. పుట్టడంతోనే ఒక చేతిలో కమండలం, మరో చేతిలో గొడుగుతో ఐదు సంవత్సరాల వయస్సు గల పిల్లవాడిగా పుట్టి బలి చక్రవర్తి చేసే యాగశాల వైపు వెళ్లనారంభించాడు. కన్నకొడుకు తీరుతో తల్లడిల్లిన ఆ తల్లి ‘పుట్టడంతోనే అలా వెళ్లిపోయావు, కనీసం గోరుముద్దలైనా తినిపించలేదు. ఇదేనా నా తపఃఫలితం’ అని బాధపడింది. దీంతో ‘అమ్మా... అందుకు విచారపడకు, త్రేతాయుగంలో నీ కోరిక తీరుస్తా’ అని వామనుడు మాట ఇచ్చాడు. త్రేతాయుగంలో రామావతారంలో అదితి, శబరిగా కనిపిస్తుంది. క్రితం జన్మలో విష్ణుమూర్తి తనకిచ్చిన మాట కోసం ఎదురు చూస్తుంది. రాముడు శబరి మాత ఇచ్చిన పళ్లు తిని మాట నిలబెట్టుకుంటాడు. మళ్లీ శబరి బాధతో ‘కనీసం నాతో కలిసి కొన్ని రోజులైనా ఉండవా...’ అంటూ కన్నీళ్లు పెట్టుకుంది. దీంతో రాముడు ‘తల్లీ, నీ కోరిక ద్వాపరయుగంలో తీరుస్తాను’ అంటూ బయలుదేరుతాడు. ద్వాపర యుగంలో అదితి, యశోదగా పునర్జన్మనెత్తుతుంది. పరిస్థితుల ప్రభావం చేత తన కొడుకు కొంత కాలం దూరంగా ఉన్నా తిరిగి తన దగ్గరకే వచ్చారు శ్రీకృష్ణుల వారు. కానీ ఇంకా తన మనస్సులో వెలితి మాత్రం మిగిలిపోయింది. అష్టభార్యలను కట్టుకున్నా, అవేమీ తన సమక్షంలో జరగలేదన్న తల్లి పడుతున్న బాధను గమనించిన కృష్ణుడు ఆమె కోరికను కలియుగంలో తీరుస్తానని మాటిస్తాడు. కలియుగంలో వెంకటేశ్వరస్వామిగా అవతారం ఎత్తిన సమయంలో వకుళాదేవిగా జన్మిస్తుంది. వకుళాదేవి తన కొడుకు శ్రీనివాసుని పెళ్లి అంగరంగ వైభవంగా తన ఆధ్వర్యంలో జరిపించి యుగ యుగాల తన కోరిక తీర్చుకుంది. పేరూరు కొండపై ఆలయం.. మన పూర్వీకులు నిర్మించిన...ప్రతిష్ట కలిగిన ఆలయాలన్నీ దాదాపు కొండపైనే ఉంటాయి. వకుళమాత ఆలయం కూడా పేరూరు కొండపైనే ఉంది. ఈ ఆలయం నిర్మాణం 500 ఏళ్ల క్రితం శ్రీ కృష్ణదేవరాయల కాలంలో జరిగినట్లు స్థానికులు పేర్కొంటున్నారు. 50 ఎకరాల్లో ఈ కొండ విస్తరించి ఉంది. ఇక్కడే పరిమళ పుష్కరిణి, నారద తీర్థం ఉండేవని పేర్కొంటారు. తిరుమలకు వచ్చే భక్తులకు ఈ ఆలయం కూడలిగా ఉండేది. భక్తులు ఇక్కడ సేదతీరి, అన్నం తిని, నిద్రచేసి కొండకు వెళ్లేవారని చెబుతుంటారు. నాడు ఆధ్యాత్మిక వెలుగులు నింపిన ఆ ఆలయం హైదర్ అలీ దండయాత్రలో దెబ్బతింది. కానీ తిరుపతిలోని చాలా ఆలయాలను సమూలంగా నాశనం చేయాలని హుకుం జారీ చేశాడు. ఎన్ని ఆలయాలు కూలిపోయినా వకుళమాత ఆలయం పాడుకాలేదు. కానీ విగ్రహాన్ని ధ్వంసం చేశారు. తర్వాత శతాబ్దాల పాటు ఈ ఆలయం దీప, ధూప నైవేద్యాలకు నోచుకోలేదు. చాలా మంది ఆ ఆలయం ఆమెది కాదని వాదించారు. స్థానికులు ఎన్ని సార్లు ఈ ఆలయాన్ని జీర్ణోద్ధరణ చేయాలని టీటీడీని వేడుకున్నా పట్టించుకోలేదు. స్వామి పరిపూర్ణానంద స్వామి పోరాటంతో... తల్లి ప్రేమకు ప్రతీకగా ఉన్న వకుళమాత ఆలయ జీర్ణోద్ధరణ కోసం శ్రీపీఠం అధిపతి స్వామి పరిపూర్ణానంద భక్తులతో కలిసి పాదయాత్రలు చేశారు. భక్తి పోరాటం చేశారు. న్యాయ స్థానంలో కేసులు వేయించి అనుకూల తీర్పును సాధించారు. టీటీడీనే వకుళమాత ఆలయ జీర్ణోద్ధరణ చేయాలని కోర్టులు సైతం తీర్పు ఇచ్చాయి. స్వామి పోరాటానికి రాజకీయ నేతలు, అధికారులు సైతం తోడ్పాటు అందించారు. దీంతో టీటీడీ రూ.2 కోట్లను మంజూరు చేసింది. 2017 మార్చి 5న ఆలయ జీర్ణోద్ధరణ పనులను స్వామి పరిపూర్ణానంద చేతుల మీదుగా ప్రారంభించారు. శరవేగంగా పనులు... పనులు ప్రారంభించిన నాటి నుంచి శరవేగంగా సాగుతున్నాయి. అస్తవ్యస్తంగా ఉన్న కొండకు క్రమపద్ధతిలో ఘాట్ రోడ్డును నిర్మిస్తున్నారు. తర్వాత దశల వారీగా ఇక్కడ నామకరణం, అన్నప్రాçశన, అక్షరాభ్యాసం వంటి సంస్కారాలు చేసుకోవడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. అలివేలు మంగాపురం తరహాలో త్వరలోనే ఇదో దివ్యధామంగా తీర్చిదిద్దనున్నట్లు టీటీడీ అధికారులు ప్రకటించారు. – సౌపాటి ప్రకాష్‌బాబు, తిరుపతి -
శ్రివారి బ్రహ్మోత్సవాలకు తిరుమలలో సైకత శిల్పం
-
తిరుమలలో 'లై' చిత్ర యూనిట్
-
శ్రీవారి బూందీపోటులో అగ్ని ప్రమాదం
తిరుపతి: తిరుమల శ్రీవారి బూందీపోటులో సోమవారం అగ్నిప్రమాదం సంభవించింది. బూందీ తయారు చేసే క్రమంలో ఆయిల్లో నీళ్లు పడటంతో ఒక్కసారిగా నూనె పొంగి మంటలు చెలరేగాయి. వెంటనే పోటు కార్మికులు, సిబ్బంది అప్రమత్తమై మంటలను అదుపులోకి తెచ్చారు. అనంతరం అగ్నిమాపక సిబ్బంది చేరుకుని మంటలను పూర్తిగా ఆర్పివేశారు. -
సీతాకోక చిలుకల సందడి
-
శ్రీవారిని దర్శించుకున్న ఎంపీ మిథున్ రెడ్డి
తిరుమల: తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని వైఎస్సార్ జిల్లా రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి దర్శించుకున్నారు. శుక్రవారం వీఐపీ బ్రేక్ దర్శన సమయంలో ఆయన శ్రీవారి సేవలో పాల్గొన్నారు. దర్శనం అనంతరం టీటీడీ అధికారులు ఆయనకు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. -
వెంకన్న ఆదాయం రూ. 89 కోట్లు
తిరుమల: కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామిని జూన్ నెలలో 24.7 లక్షల మంది భక్తులు దర్శించుకున్నారని ఆలయ ఈవో సాంబశివరావు తెలిపారు. 94 లక్షల లడ్డూలు భక్తులకు పంపిణీ చేశామని.. ఈ నెలలో హుండీ ద్వారా రూ. 89 కోట్ల ఆదాయం వచ్చిందని ఆయన తెలిపారు. ప్రత్యేక దర్శన టికెట్లు 90 రోజులు ముందుగానే ఆన్లైన్ ద్వారా తీసుకునే ఏర్పాట్లు చేశామన్నారు. త్వరలోనే బంగారు, వెండి శ్రీవారి డాలర్లతో పాటు రాగి డాలర్లను కూడా భక్తులకు విక్రయించడానికి సన్నాహాలు చేస్తున్నామని ఆయన తెలిపారు. -
భక్తులతో తిరుమల కొండ కిటకిట
తిరుమల: ఆదివారం సెలవు దినం కావడంతో శ్రీవారి దర్శనార్ధం వచ్చిన భక్తులతో తిరుమలకొండ కిటకిటలాడుతోంది. వైకుంఠం క్యూకాంప్లెక్స్‌లో భక్తులు బారులుతీరారు. అన్ని కంపార్ట్మెంట్లు నిండిపోయాయి. శ్రీవేంకటేశ్వరస్వామి సర్వదర్శనానికి 12 గంటలు, ప్రత్యేక దర్శనానికి 2 గంటలు, కాలినడకన వచ్చే భక్తులకు 10 గంటల సమయం పడుతోంది. శనివారం శ్రీవారిని 94,392మంది భక్తులు దర్శించుకున్నట్లు టీటీడీ అధికారులు తెలిపారు. -
వెంకన్న సన్నిధికి ‘మహా’ తాకిడి
- కఠినంగా వ్యహరించిన టీటీడీ.. - ఒకరితో ఆరుమందికి మించకుండా టికెట్ల కేటాయింపు తిరుమల: వేసవి సెలవులతో శుక్రవారం తిరుమల శ్రీవారి దర్శనానికి భక్తుల రద్దీ పోటెత్తింది. మరోవైపు తిరుపతిలో తెలుగుదేశం పార్టీ మహానాడుతో తెలుగుతమ్ముళ్లు సందడి పెరిగింది. ఇందుకు హాజరైన మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నేతలు కూడా శ్రీవారి దర్శనానికి క్యూ కట్టారు. అయితే టీటీడీ అధికారులు మాత్రం కఠినంగా వ్యవహరించారు. కేవలం ప్రోటోకాల్ పరిధిలోకి వచ్చినవారికే టికెట్లు కేటాయించారు. ఈరోజు ఉదయం నైవేద్య విరామ సమయంలో శ్రీవారిని దర్శించుకున్నవారిలో ఉపముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి, మంత్రులు పల్లె రఘునాథ్‌రెడ్డి, మృణాళిని, దేవినేని ఉమా మహేశ్వరరావు, ఎంపీలు రాయపాటి సాంబశివరావు, అవంతి శ్రీనివాస్, చీఫ్ విప్‌కాల్వ శ్రీనివాస్, విప్ రవికుమార్, ఎమ్మెల్యేలు జ్యోతుల నెహ్రూ, వెంకట సృజన కృష్ణరంగారావు, కాగిత వెంకట్రావు, బొగ్గురమణమూర్తి, గన్నబాబు, బాల వీరాంజనేయులు, దూళిపాటి నరేంద్రకుమార్, ఎమ్మెల్సీలు తిప్పేస్వామి, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డితోపాటు పదుల సంఖ్యలో నేతలు ఉన్నారు. వీరికి బస, దర్శనం వంటి సపర్యలు చేయటం టీటీడీ అధికారులకు తలకుమించిన భారమైంది. వీరి రద్దీని ముందే ఊహించిన టీటీడీ అధికారులు సిఫారసు లేఖలకు, బ్రేక్ దర్శన టికెట్లు నిలిపేశారు. కేవలం ప్రోటోకాల్ పరిధిలోకి వచ్చే ప్రజాప్రతినిధులు, వారిలో ఒక్కోక్కరి వెంట కేవలం ఆరు మందికి మించకుండా అనుమతించారని టీటీడీ అధికారులు తెలిపారు. -
తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ
తిరుమల: తిరుమలలో శుక్రవారం భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. ఏడు కొండలవాడి దర్శనం కోసం 31కంపార్ట్ మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. నడకదారి భక్తులు 8 కంపార్ట్ మెంట్లలో వేచి ఉండగా, వారికి 6 గంటల సమయం పడుతోంది. సర్వదర్శనానికి 10 గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 2 గంటల సమయం పడుతోంది. గురువారం శ్రీవారిని 56,356 మంది భక్తులు దర్శించుకున్నారు. -
త్వరలో ప్రతి భక్తునికి 100 గ్రాముల లడ్డూ ఉచితం
తిరుమల:త్వరలో ప్రతీ భక్తునికి వంద గ్రాముల లడ్డూను ఉచితంగా ఇచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు టీటీడీ తెలిపింది. సోమవారం నాటి టీటీడీ పాలక మండలి సమావేశంలో పలు అంశాలపై చర్చించారు. తూర్పు గోదావరి జిల్లా అయినవిల్లి విఘ్నేశ్వర ఆలయం వద్ద రూ.4 కోట్లతో విశ్రాంతి భవన నిర్మాణానికి ఆమోదం తెలిపింది. దీంతో పాటు రెండు లక్షల కేజీల ఎండు ద్రాక్ష కొనుగోలుకు రూ. 3.50 కోట్లు, ఆరు నెలల సరిపడా కందిపప్పు కొనుగోలుకు రూ.4.13 కోట్లు, ఆరు నెలల సరిపడా ఆవు నెయ్యి కొనుగోలుకు రూ. 46.92 కోట్లు కేటాయిస్తూ టీటీడీ నిర్ణయం తీసుకుంది. సెప్టెంబర్ లో జరిగే బ్రహ్మోత్సవాలను ఘనంగా నిర్వహించడంతో పాటు, వెయ్యి కాళ్ల మండపం నిర్మాణానికి ప్లాన్ ను పరిశీలిస్తున్నట్లు టీటీడీ పేర్కొంది.