
బాలీవుడ్ స్టార్ హీరోయిన్, అలనాటి అందాల తార దివంగత శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ తిరుమల శ్రీవారిని దర్శించుకుంది. నేడు (శుక్రవారం) జాన్వీ స్వామివారి సేవలో పాల్గొంది. విఐపీ తన స్నేహితురాలితో కలిసి మొక్కులు చెల్లించుకుంది. అచ్చమైన తెలుగమ్మాయిలా బ్లూ కలర్ లంగాఓణీలో కనిపించి ఆకట్టుకుంది. దర్శనానంతరం అర్చకులు ఆమెకు స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు.
చదవండి: ప్రియుడితో పెళ్లి పీటలు ఎక్కబోతున్న బిగ్‌బాస్ బ్యూటీ!
కాగా ప్రత్యేకమైన రోజుల్లో జాన్వీ తరచూ తిరుమల వచ్చి శ్రీవారిని దర్శించుకుంటుందనే విషయం తెలిసిందే. ఇటీవల ఆమె నటించి గుడ్‌లఖ్ జెర్రీ ఓటీటీలో విడుదలైన మంచి విజయం అందుకుంది. ఇక ఆమె నటించిన తాజా చిత్రం బవాల్ అనే సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధమౌవుతోంది. ఈ క్రమంలో షూటింగ్ విరామం ఇచ్చిన జాన్వీ స్వామి వారి సేవలో పాల్గనేందుకు తిరుమల వచ్చినట్లు తెలిపింది. కాగా ప్రస్తుతం ఆమె మిస్టర్ అండ్ మిస్ మహి అనే సినిమా షూటింగ్‌తో బిజీగా ఉంది.
Comments
Please login to add a commentAdd a comment