Janhvi Kapoor Said Her Mother And Father Not Like Dating, Deets Inside - Sakshi
Sakshi News home page

Janhvi Kapoor: ‘అమ్మానాన్నకు డేటింగ్‌ అంటే నచ్చదు, కానీ నాకు అలా కాదు’

Published Thu, Aug 18 2022 1:41 PM | Last Updated on Thu, Aug 18 2022 3:22 PM

Janhvi Kapoor Said Her Mother and Father Not Like Dating - Sakshi

బాలీవుడ్‌ బ్యూటీ, దివంగత నటి శ్రీదేశి కూతురు జాన్వీ కపూర్‌ లేటెస్ట్‌ చిత్రం గుడ్‌లక్‌ జెర్రీ. ఇటీవల డిస్నీ ప్లస్‌ హాట్‌స్టార్‌లో విడుదలైన ఈ మూవీ పాజిటివ్‌ టాక్‌తో ఓటీటీలో దూసుకుపోతోంది. ఈ మూవీ సక్సెస్‌ నేపథ్యంలో జాన్వీ వరుస ఇంటర్య్వూలతో బిజీగా ఉంటోంది. ఈ క్రమంలో తాజాగా ఓ చానల్‌తో ముచ్చటించిన ఆమె ప్రేమ, పెళ్లిపై స్పందించింది. అయితే డేటింగ్‌ కాన్సెప్ట్‌ అనేది తన తల్లిదండ్రులకు నచ్చదని చెప్పింది.

చదవండి: ఎట్టకేలకు కియారాతో డేటింగ్‌పై నోరు విప్పిన సిద్ధార్థ్‌, ఏమన్నాడంటే..

‘‘నాకు నచ్చిన వ్యక్తినే పెళ్లాడానేది అమ్మనాన్న(శ్రీదేవి, బోనీ కపూర్‌) కోరిక. అలా అని డేటింగ్ అంటే వారికి నచ్చదు. అమ్మ ఎప్పుడు నాతో చెబుతూ ఉండేది. ‘నీకు ఎవరైన నచ్చితే మా దగ్గరికి తీసుకురా. మేం పెళ్లి చేస్తాం’ అన్నట్లు ఉండేవారు. కానీ, నచ్చిన ప్రతి వ్యక్తిని పెళ్లాలేమని తెలుసు. కానీ లైఫ్‌లో కాస్తా ఎంజాయ్‌మెంట్‌ అనేది కూడా ఉండాలి కదా. నేను చిల్లింగ్‌ టైప్‌. కానీ చిల్‌ అనే కాన్సెప్ట్‌ని వారు అర్థం చేసుకోలేరు’’ అంటూ చెప్పుకొచ్చింది. 

చదవండి: చేతకానితనంగా చూస్తున్నారా.. బాయ్‌కాట్‌ ట్రెండ్‌పై హీరో రియాక్షన్‌

అయితే సింగిల్‌గా తన లైఫ్‌ సంతోషంగానే ఉందని తెలిపింది. ఈ క్రమంలో తన పాస్ట్‌ రిలేషన్స్‌పై జాన్వీ మాట్లాడుతూ.. ‘ఒకరితో సాన్నిహిత్యంగా ఉండటమంటే అది మన ఇష్టం. మనకు కావాలని కోరుకున్నప్పుడు దాన్ని పొందడం చాలా సౌకర్యంగా ఉంటుంది. కానీ దానికి కట్టుబడి ఉండటానికి చాలా భయపడతారు. అప్పుడు రిలేషన్‌షిప్‌ అంటేనే భయమేస్తోంది. అదే సమయంలో ఎవరితోనైనా నిజమైన సంబంధాన్ని ఏర్పరుచుకునేందుకు వారి సౌలభ్యం కోసం ఒకరిని దూరం పెట్టడాన్ని కూడా మనం యాక్సెప్ట్‌ చేయాల్సి ఉంటుంది’ అంటూ సూచించింది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement