
తిరుపతి: తిరుమల శ్రీవారి బూందీపోటులో సోమవారం అగ్నిప్రమాదం సంభవించింది. బూందీ తయారు చేసే క్రమంలో ఆయిల్‌లో నీళ్లు పడటంతో ఒక్కసారిగా నూనె పొంగి మంటలు చెలరేగాయి. వెంటనే పోటు కార్మికులు, సిబ్బంది అప్రమత్తమై మంటలను అదుపులోకి తెచ్చారు. అనంతరం అగ్నిమాపక సిబ్బంది చేరుకుని మంటలను పూర్తిగా ఆర్పివేశారు.