
సాక్షి, తిరుపతి : తిరుమల శ్రీవారి లడ్డు తయారీ కేంద్రం బూందీ పోటులో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఆదివారం పోటులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేస్తున్నాయి. అగ్ని ప్రమాదం సంభవించడంతో.. లడ్డుల తయారీ నిలిచిపోయింది. కాగా, ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment