సాక్షి, తిరుపతి : లోక కళ్యాణార్థం 180 రోజులుగా టీటీడీ అఖండ పారాయణం నిర్వహిస్తుంది. శ్రీవారి ఆలయం ముందు ఉన్న నాదనీరాజన మండపంలో ఈ కార్యక్రమం జరుగుతోంది. భగవద్గీత, సుందరకాండ పారాయణం, వశిష్ట విరాట పర్వంలోని ముఖ్యమైన వాటిని మంత్రోశ్చరణ చేస్తున్నారు. ఈ సందర్భంగా టీటీడీ ఈఓ కేఎస్ జవహర్‌రెడ్డి మాట్లాడుతూ లోక కళ్యాణార్ధం ఆరు నెలలుగా అఖండ పారాయణం నిర్వహిస్తున్నామని, ఈరోజు ఆరవ అఖండ పారాయణం 20 నుంచి 24 విభాగాల్లో 128 శ్లోకాలు అఖండ పారాయణం చేశారని తెలిపారు. ప్రపంచం ప్రజలంతా సుఖ శాంతులతో ఉండాలని స్వామి వారిని ప్రార్ధిస్తూ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. 300మంది వేద పారయణ దారులు ఈకార్యక్రమంలో పాల్గొన్నారు. (శ్రీవారిని దర్శించుకున్న పలువురు ప్రముఖులు)
Comments
Please login to add a commentAdd a comment