
తిరుమలలో సాధారణ రద్దీ
తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. స్వామివారి దర్శనం కోసం భక్తులు రెండు కంపార్టుమెంట్లలో వేచి ఉన్నారు. సర్వదర్శనానికి 3 గంటలు, ప్రత్యేక దర్శనానికి రెండు గంటలు, కాలినడకన వచ్చే భక్తులకు మూడు గంటల సమయం పడుతున్నది. శ్రీవారిని నిన్న 72,117 మంది దర్శించుకున్నారు. నిన్న హుండీ ఆదాయం రూ.3.33 కోట్లు వచ్చినట్లు ఆలయ అధికారులు తెలిపారు.