తిరుమల: సోమవారం తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. స్వామి వారి దర్శనం కోసం భక్తులు 11 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్నారు. సర్వ దర్శనానికి 7 గంటలు, కాలినడక భక్తలకు 3 గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 2 గంటల సమయం పడుతోంది.
మరోవైపు తిరుమలలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు ఘాట్ రోడ్డులో కొండ చరియలు విరిగి పడుతున్నాయి. కాలి నడక భక్తులు వర్షంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.