త్రిపుర మంత్రి టింకూ రాయ్ నేతృత్వంలోని నలుగురు సభ్యుల బృందానికి బాధితుల నుంచి చేదు అనుభవం ఎదురయ్యింది. వీరు ధలై జిల్లాలోని గండత్విజా ప్రాంతాన్ని సందర్శించినపుడు ఈ ఘటన చోటుచేసుకుంది. జూలై 12న రెండు వర్గాల మధ్య జరిగిన ఘర్షణలో గాయపడిన 19 ఏళ్ల యువకుడు మృతి చెందడంతో హింస చెలరేగింది.
ఈ ప్రాంతాన్ని మంత్రి టింకూ రాయ్ సందర్శించారు. ఈ సందర్భంగా బాధితులు ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వారు గండత్విజా డిప్యూటీ డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్ కార్యాలయాన్ని ధ్వంసం చేశారు. తమ ఇళ్లపై దాడి జరిగినప్పుడు మీరెక్కడున్నారంటూ బాధితులు మంత్రిని నిలదీశారు. ఘటన జరిగిన సమయంలో పోలీసులు, ఇతర అధికారులు తమకేమీ పట్టనట్లు వ్యవహరించారని బాధితులు ఆరోపించారు.
దీనికి సంబంధించి సోషల్ మీడియాలో షేర్ చేసిన వీడియో క్లిప్‌లో కోపోద్రిక్తులైన బాధితులు ఈ ఘటన కారణంగా తమ ప్రాంతంలో 11 వివాహాలను రద్దు చేసుకోవలసి వచ్చిందని మంత్రికి చెప్పడం కనిపిస్తుంది. వారి వాదన విన్న త్రిపుర సాంఘిక సంక్షేమ మంత్రి రాయ్ మాట్లాడుతూ ప్రభుత్వం బాధిత కుటుంబాలకు నష్టపరిహారం అందజేస్తుందని, భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు జరగకుండా తగిన భద్రత కల్పిస్తుందని హామీనిచ్చారు.
STORY | Tripura minister-led team visits violence-hit area in Dhalai district, faces ire of people.
READ: https://t.co/qbcXkrArtB
VIDEO : pic.twitter.com/OVNR0DFzDU— Press Trust of India (@PTI_News) July 15, 2024
Comments
Please login to add a commentAdd a comment