
IPL Crowd Capacity Increased To 50 Percent: ఐపీఎల్ అభిమానులకు బీసీసీఐ అదిరిపోయే వార్త చెప్పింది. ఇప్పటివరకు 25 శాతం మాత్రమే ఉన్న ప్రేక్షకుల సామర్థ్యాన్ని ఏప్రిల్ 6 నుంచి 50 శాతానికి పెంచేందుకు పచ్చ జెండా ఊపింది. ఈ మేరకు ఆన్‌లైన్‌లో టికెట్ల విక్రయాన్ని కూడా ప్రారంభిస్తున్నట్లు పేర్కొంది. దేశంలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టడంతో మహారాష్ట్ర ప్రభుత్వం కోవిడ్ నిబంధనలకు ఎత్తి వేసింది.
ఈ నేపథ్యంలోనే ఐపీఎల్ మ్యాచ్‌లను ప్రత్యక్షంగా వీక్షించే ప్రేక్షకుల సంఖ్యను పెంచేందుకు బీసీసీఐ నిర్ణయించింది. మొత్తంగా బీసీసీఐ తాజా నిర్ణయంతో మున్ముందు ఐపీఎల్ మ్యాచ్‌లు ప్రేక్షకులతో కిటకిటలాడనున్నాయి. కాగా, ముంబైలోని బ్రబోర్న్, వాంఖడే, డీవై పాటిల్, పూణేలోని మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ (ఎంసీఎ) స్టేడియల్లో ఐపీఎల్ లీగ్ మ్యాచ్‌లు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.
చదవండి: IPL 2022: రసెల్ విధ్వంసం