
PC: Cric Tracker
యాషెస్ సిరీస్‌లో భాగంగా మూడో టెస్ట్( బాక్సింగ్‌డే టెస్ట్) డిసెంబర్26 న మెలబోర్న్ వేదికగా జరగనుంది. అనూహ్యంగా ఈ మ్యాచ్‌కు పూర్తి స్ధాయిలో ప్రేక్షకులను అనుమతిస్తున్నట్లు మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్ అధికారులు తెలిపారు. ఒమ్రికాన్ వ్యాప్తి చెందుతున్న వేళ ఏంసీజీ ఇటువంటి నిర్ణయం తీసుకోవడం అందరనీ ఆశ్చర్యపరుస్తోంది. కాగా మెల్‌బోర్న్‌లో ప్రతిరోజూ 1500 కంటే ఎక్కువ కరోనా కేసులు నమోదవుతున్నాయి.
కాగా బుధవారం జరిగే ఈ మ్యాచ్‌కు ఇప్పటికే సూమారు 70,000 టిక్కెట్లు అమ్ముడుపోయాయని మెల్‌బోర్న్ క్రికెట్ క్లబ్ ఛీప్ ఎగ్జిక్యూటివ్ స్టువర్ట్ ఫాక్స్ తెలిపారు. "మేము స్టేడియంను అన్ని విధాలా సిద్ధం చేశాము. బాక్సింగ్ డే టెస్ట్ కోసం అన్ని రకాల నిబంధనలను పాటిస్తున్నాము. వ్యాక్సినేషన్ సర్టికెట్ ఉన్నవారిని లోపలకి మాత్రమే అనుమతిస్తాం" అని స్టువర్ట్ ఫాక్స్ పేర్కొన్నారు. ఇక 5 మ్యాచ్‌ల సిరీస్‌లో 2-0 తేడాతో ఆస్ట్రేలియా అధిక్యంలో ఉంది. మరో వైపు దక్షిణాఫ్రికా- భారత్ టెస్ట్ సిరీస్‌కు మాత్రం ప్రేక్షకులను అనుమతి చేయడంలేదు.
చదవండి: Omicron- India Tour Of South Africa: టీమిండియా అప్పటికప్పుడు స్వదేశానికి బయల్దేరవచ్చు.. అనుమతులు తీసుకున్నాం!
Comments
Please login to add a commentAdd a comment