Boxing Day Test match
-
IND VS AUS: రికార్డులు తిరగరాసిన బాక్సింగ్ డే టెస్ట్ మ్యాచ్
మెల్బోర్న్ వేదికగా భారత్, ఆస్ట్రేలియా మధ్య జరిగిన బాక్సింగ్ డే టెస్ట్ మ్యాచ్ రికార్డులను తిరగరాసింది. ఈ మ్యాచ్‌కు రికార్డు స్థాయిలో 3 లక్షల 73 వేల 691 మంది ప్రేక్షకులు (ఐదు రోజుల్లో) హాజరయ్యారు. బాక్సింగ్ డే టెస్ట్‌ల చరిత్రలో ఈ స్థాయిలో ప్రేక్షకులు ఎప్పుడూ హాజరుకాలేదు. ఈ మ్యాచ్ 88 ఏళ్ల రికార్డును బ్రేక్ చేసింది. 1936-37 యాషెస్ సిరీస్‌లో భాగంగా జరిగిన బాక్సింగ్ డే టెస్ట్‌కు 3,50,534 మంది (అప్పట్లో టెస్ట్ మ్యాచ్ ఆరు రోజుల పాటు జరిగేది) హాజరయ్యారు.ప్రేక్షకుల హాజరు పరంగా తాజాగా జరిగిన బాక్సింగ్ డే రెండో అత్యధికం. 1989-99లో భారత్-పాకిస్థాన్ మధ్య టెస్ట్ మ్యాచ్‌కు 4,65,000 మంది హాజరయ్యారు. టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఓ మ్యాచ్‌కు హాజరైన అత్యధిక ప్రేక్షకుల సంఖ్య ఇదే.రోజు వారీగా బాక్సింగ్ డే 2024-25 టెస్ట్‌కు హాజరైన ప్రేక్షకులు..తొలి రోజు 87,242రెండో రోజు 85,147మూడో రోజు 83,073నాలుగో రోజు 43,867ఐదో రోజు 74,363మొత్తం 3,73,691ఆస్ట్రేలియాలో ఓ టెస్ట్ మ్యాచ్‌కు హాజరైన అత్యధిక ప్రేక్షకుల సంఖ్య (3,73,691) కూడా ఇదే.మ్యాచ్ విషయానికొస్తే.. చివరి రోజు వరకు రసవత్తరంగా సాగిన తాజా బాక్సింగ్ డే టెస్ట్‌లో భారత్‌పై ఆస్ట్రేలియా 184 పరుగుల తేడాతో నెగ్గింది. ఫలితంగా ఐదు మ్యాచ్‌ల బోర్డర్ గవాస్కర్ సిరీస్‌లో ఆసీస్ 2-1 ఆధిక్యంలోకి వెళ్లింది.తాజా బాక్సింగ్ డే టెస్ట్‌కు హాజరైన ప్రేక్షకులు గతానికి భిన్నంగా ఉన్నారు. సాధారణంగా ఆస్ట్రేలియాలో జరిగే ఏ మ్యాచ్‌లోనైనా భారత ఆటగాళ్లకు ఆసీస్ క్రికెటర్లతో సమానమైన మద్దతు లభిస్తుంది. అయితే ఈ మ్యాచ్‌కు హాజరైన ఆసీస్ ప్రేక్షకులు గతానికి భిన్నంగా టీమిండియాకు వ్యతిరేకంగా ప్రవర్తించారు. కొందరు ఆసీస్ అభిమానులు టీమిండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లిని టార్గెట్‌గా చేసుకుని ఓవరాక్షన్ చేశారు. కోహ్లి మైదానంలో ఫీల్డింగ్ చేస్తున్నప్పుడు.. కోహ్లి ఔటై పెవిలియన్‌కు చేరే సమయంలో కొందరు ఆసీస్ ప్రేక్షకులు దురుసుగా ప్రవర్తించారు. -
IND VS AUS: బాక్సింగ్ డే టెస్ట్‌కు యమ క్రేజ్..!
భారత్, ఆస్ట్రేలియా మధ్య డిసెంబర్ 26 నుంచి జరుగబోయే నాలుగో టెస్ట్‌కు ఫుల్ క్రేజ్ ఏర్పడింది. ఈ మ్యాచ్‌ను బాక్సింగ్ డే టెస్ట్ అని పిలుస్తారు. బాక్సింగ్ డే టెస్ట్ ప్రారంభానికి ఇంకా 16 రోజుల సమయం ఉన్నా టిక్కెట్లన్నీ అప్పుడే అమ్ముడుపోయాయి. బాక్సింగ్ డే టెస్ట్ జరుగబోయే మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్ కెపాసిటీ 90000 కాగా.. తొలి రోజు టిక్కెట్లన్నీ అమ్ముడుపోయినట్లు క్రికెట్ ఆస్ట్రేలియా ప్రకటించింది. బాక్సింగ్ డే టెస్ట్‌కు ఉన్న క్రేజ్ దృష్ట్యా మ్యాచ్ ప్రారంభానికి రెండు రోజుల ముందు మరి కొన్ని టిక్కెట్లు విడుదల చేస్తామని క్రికెట్ ఆస్ట్రేలియా తెలిపింది.కాగా, భారత్-ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ రసత్తరంగా సాగుతుంది. ఐదు మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో ప్రస్తుతం ఇరు జట్లు చెరో మ్యాచ్ గెలిచాయి. మూడో టెస్ట్ బ్రిస్బేన్ వేదికగా డిసెంబర్ 14 నుంచి ప్రారంభమవుతుంది. ఈ వేదికపై చివరి పర్యటనలో భారత్ ఆసీస్‌పై సంచలన విజయం సాధించింది. అందుకే ఈ మ్యాచ్‌పై భారీ అంచనాలు ఉన్నాయి. మూడో టెస్ట్‌కు సంబంధించి తొలి రోజు టిక్కెట్లు కూడా అప్పుడే అమ్ముడుపోయాయి. రెండో రోజు టిక్కెట్లు కూడా దాదాపుగా సోల్డ్ అవుట్ అయినట్లు తెలుస్తుంది.తొలి రెండు టెస్ట్‌లకు ఊహించని స్పందనభారత్-ఆస్ట్రేలియా మధ్య పెర్త్, అడిలైడ్ వేదికగా జరిగిన తొలి రెండు టెస్ట్‌లకు కూడా ఊహించని స్పందన వచ్చింది. పెర్త్‌లోని ఆప్టస్ స్టేడియంలో జరిగిన తొలి టెస్ట్‌కు రికార్డు స్థాయిలో ప్రేక్షకులు హాజరయ్యారు. తొలి రెండో రోజులు స్టేడియం మొత్తం ఫుల్ అయిపోయింది. రెండో టెస్ట్ తొలి మూడు రోజుల ఆటకు 1,35,012 మంది ప్రేక్షకులు హాజరైనట్లు క్రికెట్ ఆస్ట్రేలియా వర్గాలు పేర్కొన్నాయి. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ బెర్త్‌లు ఖరారు చేసే సిరీస్ కావడంతో ఈ సిరీస్‌కు మరింత క్రేజ్ పెరిగింది. క్రికెట్ అభిమానులు ప్రపంచం నలుమూలల నుంచి వచ్చి ఈ మ్యాచ్‌లను వీక్షిస్తున్నారు. -
ఎల్గర్ అజేయ సెంచరీతో...
‘బాక్సింగ్ డే’ టెస్టుపై దక్షిణాఫ్రికా ఆధిక్యం కనబరుస్తోంది. రెండో రోజు ఆటలో భారత్‌ను తొలి ఇన్నింగ్స్‌లో 245 పరుగులకు ఆలౌట్ చేసిన సఫారీ బ్యాటింగ్‌లోనూ సత్తా చాటుకుంది. దక్షిణాఫ్రికా ఆరంభానికి సిరాజ్ తూట్లు పొడిచినప్పటికీ ఓపెనర్ డీన్ ఎల్గర్ (అజేయ) శతకంతో సాఫీగా సాగిపోయింది. రెండు పటిష్టమైన భాగస్వామ్యాలతో సఫారీ తొలి ఇన్నింగ్స్‌లో ఆధిక్యం సంపాదించేందుకు ఎల్గర్ కీలకపాత్ర పోషించాడు. సెంచూరియన్: ఓవర్‌నైట్ బ్యాటర్ కేఎల్ రాహుల్ సెంచరీ మినహా తొలి టెస్టులో రెండో రోజంతా దక్షిణాఫ్రికా హవానే నడిచింది. ఓపెనర్ ఎల్గర్ చక్కని సెంచరీతో సఫారీ భారీ స్కోరుపై కన్నేసింది. తద్వారా దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌లో ఆధిక్యాన్ని పెంచుకునేందుకు పట్టుబిగిస్తోంది. బుధవారం రెండో రోజు ఆటలో తొలుత భారత్ తొలి ఇన్నింగ్స్ 67.4 ఓవర్లలో 245 పరుగుల వద్ద ముగిసింది. రాహుల్ (137 బంతుల్లో 101; 14 ఫోర్లు, 4 సిక్స్‌లు) టెస్టుల్లో ఎనిమిదో శతకం సాధించాడు. మొదటి రోజే రబడ 5 వికెట్లు తీయగా, రెండో రోజు మిగిలిన రెండు వికెట్లలో కొయెట్జీ (1/74), బర్గర్ (3/50) చెరొకటి తీశారు. అనంతరం తొలి ఇన్నింగ్స్ ఆరంభించిన దక్షిణాఫ్రికా వెలుతురు మందగించి ఆట నిలిచే సమయానికి 66 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 256 పరుగులు చేసి 11 పరుగుల ఆధిక్యం దక్కించుకుంది. ఎల్గర్ (140 బ్యాటింగ్; 23 ఫోర్లు), జాన్సెన్ (3 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. బుమ్రా, సిరాజ్ చెరో 2 వికెట్లు పడగొట్టాడు. శతకం పూర్తయ్యాక ఆలౌట్! వర్షం, గ్రౌండ్ తడి ఆరడానికి సమయం పట్టడంతో రెండో రోజు కూడా ఆట ఆలస్యంగానే మొదలైంది. ఓవర్‌నైట్ స్కోరు 208/8తో తొలి ఇన్నింగ్స్‌ను కొనసాగించిన భారత్ తొలి సెషన్లో 8.4 ఓవర్లు మాత్రమే ఆడగలిగింది. ఓవర్‌నైట్ బ్యాటర్లు రాహుల్, సిరాజ్ (5) తొమ్మిదో వికెట్‌కు 47 పరుగులు జోడించారు. రాహుల్ సెంచరీకి చేరువయ్యాక కొయెట్టీ 65వ ఓవర్ తొలి బంతికి సిరాజ్‌ను అవుట్ చేశాడు. అదే ఓవర్ ఆఖరి బంతికి భారీ సిక్సర్‌తో రాహుల్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. కాసేపటికే బర్గర్ అతన్ని బౌల్డ్ చేయడంతో 245 పరుగుల వద్ద తొలి ఇన్నింగ్స్‌కు తెరపడింది. సిరాజ్ దెబ్బ తీసినా... దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్ ఆరంభంలోనే సిరాజ్ దెబ్బకొట్టాడు. ఓపెనర్ మార్క్రమ్ (5) కీపర్ క్యాచ్‌తో వెనుదిరిగేలా చేశాడు. అయితే భారత శిబిరానికి ఈ ఆనందం తర్వాత శ్రమించక తప్పలేదు. క్రీజులో ఉన్న మరో ఓపెనర్ ఎల్గర్‌కు జతయిన టోనీ డి జార్జి (62 బంతుల్లో 28; 5 ఫోర్లు) భారత బౌలర్లను తేలిగ్గా ఎదుర్కొన్నారు. 49/1 స్కోరువద్ద తొలి సెషన్ ముగియగా... రెండో సెషన్లోనూ ఈ జోడీ భారత బౌలింగ్ దళాన్ని కష్టపెట్టింది. ఎల్గర్ అర్ధసెంచరీ పూర్తి చేసుకోగా... సఫారీ స్కోరు వంద దాటింది. ఈ దశలో బుమ్రా వైవిధ్యమైన బంతులతో రెండు కీలక వికెట్లను పడగొట్టి టీమిండియాను ఊరడించాడు. రెండో వికెట్‌కు 93 పరుగులు జోడించాక జార్జిని, తన మరుసటి ఓవర్లో పీటర్సన్ (2)ను పెవిలియన్ చేర్చాడు. 113 పరుగుల వద్ద 3 వికెట్లను కోల్పోయి ఆత్మరక్షణలో పడింది. అయితే క్రీజులో పాతుకుపోయిన ఎల్గర్‌కు బడింగ్హామ్ చక్కని సహకారం ఇవ్వడంతో మరో భారీ భాగస్వామ్యం దక్షిణాఫ్రికాను నిలబెట్టింది. ఎల్గర్ శతకాన్ని పూర్తి చేసుకోగా... టీ విరామం (194/3) వరకు మరో వికెట్ పడకుండా జాగ్రత్తపడ్డారు. ఆఖరి సెషన్లోనూ ఎల్గర్–బడింగ్హామ్ జోడీ భారత బౌలర్లకు పరీక్షపెట్టింది. ఈ క్రమంలో బడింగ్హామ్ ఫిఫ్టీ పూర్తి చేసుకున్నాడు. నాలుగో వికెట్‌కు 131 పరుగులు జోడించాక సిరాజ్ ఓవర్లో బడింగ్హామ్ (56; 7 ఫోర్లు, 2 సిక్స్‌లు) నిష్క్రమించాడు. వెరిన్ (4)ను ప్రసిధ్ అవుట్ చేశాడు. తర్వాత కాసేపటికే బ్యాడ్‌లైట్‌తో ఆటను నిలిపివేశారు. స్కోరు వివరాలు భారత్ తొలి ఇన్నింగ్స్: యశస్వి (సి) వెరిన్ (బి) బర్గర్ 17; రోహిత్ (సి) బర్గర్ (బి) రబడ 5; శుబ్‌మన్ (సి) వెరిన్ (బి) బర్గర్ 2; కోహ్లి (సి) వెరిన్ (బి) రబడ 38; అయ్యర్ (బి) రబడ 31; రాహుల్ (బి) బర్గర్ 101; అశ్విన్ (సి) సబ్–ముల్డర్ (బి) రబడ 8; శార్దుల్ (సి) ఎల్గర్ (బి) రబడ 24; బుమ్రా (బి) జాన్సెన్ 1; సిరాజ్ (సి) వెరిన్ (బి) కొయెట్జీ 5; ప్రసిధ్ కృష్ణ (నాటౌట్) 0; ఎక్స్‌ట్రాలు 13; మొత్తం (67.4 ఓవర్లలో ఆలౌట్) 245. వికెట్ల పతనం: 1–13, 2–23, 3–24, 4–92, 5–107, 6–121, 7–164, 8–191, 9–238, 10–245. బౌలింగ్: రబడ 20–4–59–5, మార్కొ జాన్సెన్ 16–2–52–1, బర్గర్ 15.4–4–50–3, కొయెట్జీ 16–1–74–1. దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్: మార్క్రమ్ (సి) రాహుల్ (బి) సిరాజ్ 5; ఎల్గర్ (బ్యాటింగ్) 140; టోని జార్జి (సి) యశస్వి (బి) బుమ్రా 28; పీటర్సన్ (బి) బుమ్రా 2; బెడింగ్హమ్ (బి) సిరాజ్ 56; వెరిన్ (సి)రాహుల్ (బి) ప్రసిధ్‌కృష్ణ 4; జాన్సెన్ (బ్యాటింగ్) 3; ఎక్స్‌ట్రాలు 18; మొత్తం (66 ఓవర్లలో 5 వికెట్లకు) 256. వికెట్ల పతనం: 1–11, 2–104, 3–113, 4–244, 5–249. బౌలింగ్: బుమ్రా 16–3–48–2, సిరాజ్ 15–0–63–2, శార్దుల్ 12–2–57–0, ప్రసిధ్‌కృష్ణ 15–2–61–1, అశ్విన్ 8–3–19–0. -
అభిమానులకు ‘గుడ్‌న్యూస్’... స్టేడియంలోకి అనుమతి.. అయితే!
యాషెస్ సిరీస్‌లో భాగంగా మూడో టెస్ట్( బాక్సింగ్‌డే టెస్ట్) డిసెంబర్26 న మెలబోర్న్ వేదికగా జరగనుంది. అనూహ్యంగా ఈ మ్యాచ్‌కు పూర్తి స్ధాయిలో ప్రేక్షకులను అనుమతిస్తున్నట్లు మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్ అధికారులు తెలిపారు. ఒమ్రికాన్ వ్యాప్తి చెందుతున్న వేళ ఏంసీజీ ఇటువంటి నిర్ణయం తీసుకోవడం అందరనీ ఆశ్చర్యపరుస్తోంది. కాగా మెల్బోర్న్లో ప్రతిరోజూ 1500 కంటే ఎక్కువ కరోనా కేసులు నమోదవుతున్నాయి. కాగా బుధవారం జరిగే ఈ మ్యాచ్‌కు ఇప్పటికే సూమారు 70,000 టిక్కెట్లు అమ్ముడుపోయాయని మెల్బోర్న్ క్రికెట్ క్లబ్ ఛీప్ ఎగ్జిక్యూటివ్ స్టువర్ట్ ఫాక్స్ తెలిపారు. "మేము స్టేడియంను అన్ని విధాలా సిద్ధం చేశాము. బాక్సింగ్ డే టెస్ట్ కోసం అన్ని రకాల నిబంధనలను పాటిస్తున్నాము. వ్యాక్సినేషన్ సర్టికెట్ ఉన్నవారిని లోపలకి మాత్రమే అనుమతిస్తాం" అని స్టువర్ట్ ఫాక్స్ పేర్కొన్నారు. ఇక 5 మ్యాచ్‌ల సిరీస్‌లో 2-0 తేడాతో ఆస్ట్రేలియా అధిక్యంలో ఉంది. మరో వైపు దక్షిణాఫ్రికా- భారత్ టెస్ట్ సిరీస్‌కు మాత్రం ప్రేక్షకులను అనుమతి చేయడంలేదు. చదవండి: Omicron- India Tour Of South Africa: టీమిండియా అప్పటికప్పుడు స్వదేశానికి బయల్దేరవచ్చు.. అనుమతులు తీసుకున్నాం! -
జడేజాకు చేటు, అక్షర్ కు చోటు!
మెల్బోర్న్: భారత యువ లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ అక్షర్ పటేల్ కు టెస్టు జట్టులో చోటు దక్కింది. గాయపడిన ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా స్థానంలో అతడిని తీసుకున్నట్టు బీసీసీఐ సోమవారం తెలిపింది. భుజం గాయం కారణంగా ఆస్ట్రేలియాతో చివరి రెండు టెస్టులకు జడేజా దూరమయ్యాడు. దీంతో అతడు స్వదేశానికి వెళ్లి చికిత్స తీసుకోనున్నాడు. జనవరిలో జరగనున్న ముక్కోణపు సిరీస్ లో అతడు పాల్గొంటాడా, లేదా అనేది అనుమానంగా మారింది. కాగా 20 ఏళ్ల అక్షర్ పటేల్ ఇప్పటివరకు 9 వన్డేలు ఆడి 14 వికెట్లు పడగొట్టాడు. శ్రీలంకపై 3/40తో వ్యక్తిగత అత్యుత్తమ గణాంకాలు సాధించాడు. శుక్రవారం నుంచి బాక్సింగ్ డే టెస్టు మ్యాచ్ ప్రారంభంకానున్న నేపథ్యంలో ఆలోపు అతడు మెల్బోర్న్ చేరుకునే అవకాశముంది.