
మెల్‌బోర్న్ వేదికగా భారత్, ఆస్ట్రేలియా మధ్య జరిగిన బాక్సింగ్ డే టెస్ట్ మ్యాచ్ రికార్డులను తిరగరాసింది. ఈ మ్యాచ్‌కు రికార్డు స్థాయిలో 3 లక్షల 73 వేల 691 మంది ప్రేక్షకులు (ఐదు రోజుల్లో) హాజరయ్యారు. బాక్సింగ్ డే టెస్ట్‌ల చరిత్రలో ఈ స్థాయిలో ప్రేక్షకులు ఎప్పుడూ హాజరుకాలేదు.
ఈ మ్యాచ్ 88 ఏళ్ల రికార్డును బ్రేక్ చేసింది. 1936-37 యాషెస్ సిరీస్‌లో భాగంగా జరిగిన బాక్సింగ్ డే టెస్ట్‌కు 3,50,534 మంది (అప్పట్లో టెస్ట్ మ్యాచ్ ఆరు రోజుల పాటు జరిగేది) హాజరయ్యారు.
ప్రేక్షకుల హాజరు పరంగా తాజాగా జరిగిన బాక్సింగ్ డే రెండో అత్యధికం. 1989-99లో భారత్-పాకిస్థాన్ మధ్య టెస్ట్ మ్యాచ్‌కు 4,65,000 మంది హాజరయ్యారు. టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఓ మ్యాచ్‌కు హాజరైన అత్యధిక ప్రేక్షకుల సంఖ్య ఇదే.
రోజు వారీగా బాక్సింగ్ డే 2024-25 టెస్ట్‌కు హాజరైన ప్రేక్షకులు..
తొలి రోజు 87,242
రెండో రోజు 85,147
మూడో రోజు 83,073
నాలుగో రోజు 43,867
ఐదో రోజు 74,363
మొత్తం 3,73,691
ఆస్ట్రేలియాలో ఓ టెస్ట్ మ్యాచ్‌కు హాజరైన అత్యధిక ప్రేక్షకుల సంఖ్య (3,73,691) కూడా ఇదే.
మ్యాచ్ విషయానికొస్తే.. చివరి రోజు వరకు రసవత్తరంగా సాగిన తాజా బాక్సింగ్ డే టెస్ట్‌లో భారత్‌పై ఆస్ట్రేలియా 184 పరుగుల తేడాతో నెగ్గింది. ఫలితంగా ఐదు మ్యాచ్‌ల బోర్డర్ గవాస్కర్ సిరీస్‌లో ఆసీస్ 2-1 ఆధిక్యంలోకి వెళ్లింది.
తాజా బాక్సింగ్ డే టెస్ట్‌కు హాజరైన ప్రేక్షకులు గతానికి భిన్నంగా ఉన్నారు. సాధారణంగా ఆస్ట్రేలియాలో జరిగే ఏ మ్యాచ్‌లోనైనా భారత ఆటగాళ్లకు ఆసీస్ క్రికెటర్లతో సమానమైన మద్దతు లభిస్తుంది. అయితే ఈ మ్యాచ్‌కు హాజరైన ఆసీస్ ప్రేక్షకులు గతానికి భిన్నంగా టీమిండియాకు వ్యతిరేకంగా ప్రవర్తించారు.
కొందరు ఆసీస్ అభిమానులు టీమిండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లిని టార్గెట్‌గా చేసుకుని ఓవరాక్షన్ చేశారు. కోహ్లి మైదానంలో ఫీల్డింగ్ చేస్తున్నప్పుడు.. కోహ్లి ఔటై పెవిలియన్‌కు చేరే సమయంలో కొందరు ఆసీస్ ప్రేక్షకులు దురుసుగా ప్రవర్తించారు.