భారత్, ఆస్ట్రేలియా మధ్య డిసెంబర్ 26 నుంచి జరుగబోయే నాలుగో టెస్ట్‌కు ఫుల్ క్రేజ్ ఏర్పడింది. ఈ మ్యాచ్‌ను బాక్సింగ్ డే టెస్ట్ అని పిలుస్తారు. బాక్సింగ్ డే టెస్ట్ ప్రారంభానికి ఇంకా 16 రోజుల సమయం ఉన్నా టిక్కెట్లన్నీ అప్పుడే అమ్ముడుపోయాయి.
బాక్సింగ్ డే టెస్ట్ జరుగబోయే మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్ కెపాసిటీ 90000 కాగా.. తొలి రోజు టిక్కెట్లన్నీ అమ్ముడుపోయినట్లు క్రికెట్ ఆస్ట్రేలియా ప్రకటించింది. బాక్సింగ్ డే టెస్ట్‌కు ఉన్న క్రేజ్ దృష్ట్యా మ్యాచ్ ప్రారంభానికి రెండు రోజుల ముందు మరి కొన్ని టిక్కెట్లు విడుదల చేస్తామని క్రికెట్ ఆస్ట్రేలియా తెలిపింది.
కాగా, భారత్-ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ రసత్తరంగా సాగుతుంది. ఐదు మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో ప్రస్తుతం ఇరు జట్లు చెరో మ్యాచ్ గెలిచాయి. మూడో టెస్ట్ బ్రిస్బేన్ వేదికగా డిసెంబర్ 14 నుంచి ప్రారంభమవుతుంది. ఈ వేదికపై చివరి పర్యటనలో భారత్ ఆసీస్‌పై సంచలన విజయం సాధించింది.
అందుకే ఈ మ్యాచ్‌పై భారీ అంచనాలు ఉన్నాయి. మూడో టెస్ట్‌కు సంబంధించి తొలి రోజు టిక్కెట్లు కూడా అప్పుడే అమ్ముడుపోయాయి. రెండో రోజు టిక్కెట్లు కూడా దాదాపుగా సోల్డ్ అవుట్ అయినట్లు తెలుస్తుంది.
తొలి రెండు టెస్ట్‌లకు ఊహించని స్పందన
భారత్-ఆస్ట్రేలియా మధ్య పెర్త్, అడిలైడ్ వేదికగా జరిగిన తొలి రెండు టెస్ట్‌లకు కూడా ఊహించని స్పందన వచ్చింది. పెర్త్‌లోని ఆప్టస్ స్టేడియంలో జరిగిన తొలి టెస్ట్‌కు రికార్డు స్థాయిలో ప్రేక్షకులు హాజరయ్యారు. తొలి రెండో రోజులు స్టేడియం మొత్తం ఫుల్ అయిపోయింది.
రెండో టెస్ట్ తొలి మూడు రోజుల ఆటకు 1,35,012 మంది ప్రేక్షకులు హాజరైనట్లు క్రికెట్ ఆస్ట్రేలియా వర్గాలు పేర్కొన్నాయి. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ బెర్త్‌లు ఖరారు చేసే సిరీస్ కావడంతో ఈ సిరీస్‌కు మరింత క్రేజ్ పెరిగింది. క్రికెట్ అభిమానులు ప్రపంచం నలుమూలల నుంచి వచ్చి ఈ మ్యాచ్‌లను వీక్షిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment