జడేజాకు చేటు, అక్షర్ కు చోటు! | Young Axar Patel to replace Jadeja in Test squad | Sakshi
Sakshi News home page

జడేజాకు చేటు, అక్షర్ కు చోటు!

Published Mon, Dec 22 2014 6:42 PM | Last Updated on Sat, Sep 2 2017 6:35 PM

జడేజాకు చేటు, అక్షర్ కు చోటు!

జడేజాకు చేటు, అక్షర్ కు చోటు!

మెల్బోర్న్: భారత యువ లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ అక్షర్ పటేల్ కు టెస్టు జట్టులో చోటు దక్కింది. గాయపడిన ఆల్రౌండర్ రవీంద్ర జడేజా స్థానంలో అతడిని తీసుకున్నట్టు బీసీసీఐ సోమవారం తెలిపింది. భుజం గాయం కారణంగా ఆస్ట్రేలియాతో చివరి రెండు టెస్టులకు జడేజా దూరమయ్యాడు. దీంతో అతడు స్వదేశానికి వెళ్లి చికిత్స తీసుకోనున్నాడు. జనవరిలో జరగనున్న ముక్కోణపు సిరీస్ లో అతడు పాల్గొంటాడా, లేదా అనేది అనుమానంగా మారింది.

కాగా 20 ఏళ్ల అక్షర్ పటేల్ ఇప్పటివరకు 9 వన్డేలు ఆడి 14 వికెట్లు పడగొట్టాడు. శ్రీలంకపై 3/40తో వ్యక్తిగత అత్యుత్తమ గణాంకాలు సాధించాడు. శుక్రవారం నుంచి బాక్సింగ్ డే టెస్టు మ్యాచ్ ప్రారంభంకానున్న నేపథ్యంలో ఆలోపు అతడు మెల్బోర్న్ చేరుకునే అవకాశముంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement