
ఇష్టమైన కలలు వచ్చినప్పుడు.. అవి నిజమవ్వాలని చాలా మందే కోరుకుంటారు. అవేవీ జరగవు. కానీ యూఎస్‌లో ఓ వ్యక్తి కల నిజమైంది. రెండు డాలర్లు పెట్టి టికెట్ కొంటే రెండు కోట్ల లాటరీ గెలుచుకున్నాడు. అదెలా ఆశ్చర్యపోతున్నారా? అయితే ఇది చదివేయండి. వర్జీనియాలోని హెన్రికో కౌంటీకి చెందిన అలోంజో కోల్‌మాన్ రిటైర్డ్ ఉద్యోగి. అతనికి 13–14–15–16–17–18–19నంబర్ల లాటరీ కొంటే, అది గెలిచినట్టు కల వచ్చింది. కలే కదా అని కొట్టి పారేయలేదు.
గ్రేటర్ రిచ్‌మండ్ రీజియన్‌లోని తన స్వస్థలమైన కార్నర్ మార్ట్ నుంచి కలలో వచ్చిన నంబర్లతోనే ఉన్న లాటరీ టికెట్ 13–14–15–16–17–18ను రెండు డాలర్లు పెట్టి కొన్నాడు. అప్పటినుంచి డ్రా తేదీ జూన్ 11కోసం ఎదురుచూస్తున్నాడు. ఆరోజురానే వచ్చింది. వెళ్లి చూస్తే... స్క్రీన్ మీద అతని లాటరీ నంబర్ 13–14–15–16–17–18, రెండున్నర లక్షల డాలర్లు గెలుపొందినట్టుగా ఉండటంతో అతని ఆనందానికి అవధులు లేవు. రూ.1,97,37,725లు, అంటే దాదాపు రెండు కోట్ల రూపాయలు గెలుచుకున్నాడు. అయితే తన కలలో వచ్చిన నంబర్ సెట్స్‌నే తాను కొన్నానని, ఆ లాటరీ టికెట్ తగలడం నిజంగా నమ్మలేకున్నానని చెప్పాడు కోల్‌మాన్. ఇటీవల, ఒక ట్రక్ డ్రైవర్‌కూడా ఇలాగే 7.9 కోట్ల జాక్‌పాట్ కొట్టాడు.
Comments
Please login to add a commentAdd a comment