త్రిష ఇప్పుడు నెగటివ్! | Trisha To Join Dhanush’s Next With Director Durai Senthilkumar | Sakshi
Sakshi News home page

త్రిష ఇప్పుడు నెగటివ్!

Published Fri, Oct 30 2015 10:48 PM | Last Updated on Sun, Sep 3 2017 11:44 AM

త్రిష ఇప్పుడు నెగటివ్!

త్రిష ఇప్పుడు నెగటివ్!

ఎప్పట్నుంచో త్రిష కంటున్న ఓ కల నెరవేరనుంది. కథానాయికగా దక్షిణాదిన తిరుగులేదనిపించుకున్న ఈ బ్యూటీకి ఒక్కసారైనా నెగటివ్ షేడ్ ఉన్న పాత్ర చేయాలనే కోరిక ఉంది. పన్నెండేళ్ల కెరీర్‌లో ఈ విషయాన్ని త్రిష పలుమార్లు వ్యక్తపరిచారు. చివరికి ఇప్పుడు త్రిష కల నెరవేరే సమయం ఆసన్నమైందని చెన్నయ్ టాక్. ధనుష్ హీరోగా త్వరలో ఓ చిత్రం ఆరంభం కానుందట. ఇందులో ధనుష్ అన్నదమ్ములుగా ద్విపాత్రాభినయం చేయనున్నారని వినికిడి. అన్న పాత్ర సరసన త్రిషను ఎంపిక చేశారట.

తమ్ముడి పాత్ర సరసన ‘షామిలి’ (‘ఓయ్’ చిత్రం ఫేం)ని తీసుకున్నారని వినికిడి. త్రిష పాత్ర నెగటివ్ షేడ్స్‌తో ఉంటుందట. ఈ పాత్ర గురించి చెప్పగానే త్రిష గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారని బోగట్టా. దురై సెంథిల్‌కుమార్ దర్శకత్వంలో రూపొందనున్న ఈ చిత్రం నవంబర్‌లో ఆరంభం అవుతుందట.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement