Durai senthilkumar
-
ధనుష్‌కు విలన్‌గా తెలుగు హీరో
ఒక భాషలో హీరోగా నటిస్తున్న తారలు ఇతర భాషల్లో ప్రతినాయక పాత్రల్లో కనిపించేందుకు ఇంట్రస్ట్ చూపిస్తున్నారు. ఇప్పటికే తెలుగులో ఆది పినిశెట్టి విలన్‌గా దూసుకుపోతున్నాడు. తాజాగా కోలీవుడ్ విశాల్ కూడా మలయాళ సినిమాతో నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో మెప్పించాడు. ఇక బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ 2.ఓ కోసం విలన్‌గా మారాడు. తాజాగా ఈ లిస్ట్‌లో చేరేందుకు ఓ తెలుగు హీరో రెడీ అవుతున్నాడు. అందాల రాక్షసి సినిమాతో టాలీవుడ్ పరిచయం అయిన నటుడు నవీన్ చంద్ర. తొలి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకున్న నవీన్, తరువాత హీరోగా సక్సెస్‌లు సాధించలేకపోయాడు. ఇటీవల అరవింద సమేతతో నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో ఆకట్టుకోవటంతో ఈ యువ నటుడికి కోలీవుడ్ నుంచి పిలుపు వచ్చింది. తమిళ స్టార్ హీరో ధనుష్ హీరోగా దురై సెంథిల్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాలో నవీన్ ప్రతినాయక పాత్రలో కనిపించనున్నాడు. ఈ విషయాన్ని చిత్ర నిర్మాతలు అధికారికంగా ప్రకటించారు. మార్చి 6న ప్రారంభమైన ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానుంది. Welcome on board #AndalaRakshasi & #AravindaSametha fame @Naveenc212. We are glad to have you play an important role in our film. pic.twitter.com/HVCo2ZWzXY — Sathya Jyothi Films (@SathyaJyothi_) 27 March 2019 -
రాజకీయ నేతగా త్రిష!
ఈ ఏడాది తమిళనాడు శాసనసభకు ఎన్నికలు జరగనున్న వేళ హీరోయిన్ త్రిష రాజకీయాల్లోకి వచ్చారా? ఏంటి? రాజకీయ నాయకుల ఫక్కీలో నమస్కారం పెడుతున్న త్రిష బొమ్మలు గోడల మీద కనిపించడంతో తమిళనాట ఇప్పుడు అందరూ అదే అనుకుంటున్నారు. విషయమేమిటని ఆరా తీస్తే, ఆ పోస్టర్లు, గోడ మీద రాతలన్నీ త్రిష కొత్త సినిమాలోని పాత్రకు సంబంధించినవట! ధనుష్ సరసన తొలిసారిగా త్రిష నటిస్తున్న ఈ పొలిటికల్ థ్రిల్లర్ సినిమా పేరు - ‘కొడి’. అంటే తమిళంలో ‘జెండా’ అని అర్థం. దురై సెంథిల్‌కుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రానికి నిర్మాత కూడా ధనుషే. ఇందులో ఆయన తొలిసారిగా అన్నదమ్ముల పాత్రల్లో ద్విపాత్రాభినయం చేస్తున్నారు. రెండో హీరోయిన్గా షామిలి నటిస్తున్నారు. ఈ చిత్రంలో త్రిష పేరు ‘రుద్ర’ అనీ, ఇందులో ఒక ఘట్టంలో ఎన్నికల్లో పోరాడే రాజకీయ నాయకురాలిగా ఆమె కనిపిస్తారనీ కోడంబాకమ్ కబురు. మొత్తానికి, కథానాయిక త్రిష ఇప్పుడు కెరీర్లో కొత్త దశకు చేరుకున్నట్లు కనిపిస్తున్నారు. ఒకప్పుడు గ్లామర్ పాత్రల్లో కనిపించిన ఆమె ఇప్పుడు కొత్త తరహా పాత్రల వైపు మొగ్గుచూపుతున్నారను కోవచ్చు. ఈ చెన్నై సుందరి ఇటీవల నటిస్తున్న సినిమాలు, చేస్తున్న పాత్రలే అందుకు ఉదాహరణ. కమలహాసన్ ‘చీకటి రాజ్యం’లో పోలీసు అధికారిగా, ఈ మధ్యే ‘కళావతి’ (తమిళ మాతృక ‘అరణ్మణై-2’)లో భీతిల్లిన హీరోయిన్గా, తెలుగు- తమిళాల్లో రూపొందుతోన్న హార్రర్ థ్రిల్లర్ ‘నాయకి’ చిత్రంలో 1980ల నాటి ఫ్యాషన్‌లో కనిపించే నాయికగా - ఇలా మునుపటి కన్నా భిన్నమైన పాత్రల్లో కనిపిస్తున్నారు. వీటన్నిటికీ భిన్నంగా ఇప్పుడు ధనుష్ సినిమాలో రాజకీయ నేతగా కనిపించడం విశేషం. వెరసి, ప్రేమ, పెళ్ళి వ్యవహారాలన్నీ పక్కనపెట్టేశాక, ఈ అందగత్తె కొత్త తరహా పాత్రల పైనే దృష్టి పెడుతున్నారనుకోవాలి. అదీ ఒకందుకు మంచిదే! -
త్రిష ఇప్పుడు నెగటివ్!
ఎప్పట్నుంచో త్రిష కంటున్న ఓ కల నెరవేరనుంది. కథానాయికగా దక్షిణాదిన తిరుగులేదనిపించుకున్న ఈ బ్యూటీకి ఒక్కసారైనా నెగటివ్ షేడ్ ఉన్న పాత్ర చేయాలనే కోరిక ఉంది. పన్నెండేళ్ల కెరీర్లో ఈ విషయాన్ని త్రిష పలుమార్లు వ్యక్తపరిచారు. చివరికి ఇప్పుడు త్రిష కల నెరవేరే సమయం ఆసన్నమైందని చెన్నయ్ టాక్. ధనుష్ హీరోగా త్వరలో ఓ చిత్రం ఆరంభం కానుందట. ఇందులో ధనుష్ అన్నదమ్ములుగా ద్విపాత్రాభినయం చేయనున్నారని వినికిడి. అన్న పాత్ర సరసన త్రిషను ఎంపిక చేశారట. తమ్ముడి పాత్ర సరసన ‘షామిలి’ (‘ఓయ్’ చిత్రం ఫేం)ని తీసుకున్నారని వినికిడి. త్రిష పాత్ర నెగటివ్ షేడ్స్‌తో ఉంటుందట. ఈ పాత్ర గురించి చెప్పగానే త్రిష గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారని బోగట్టా. దురై సెంథిల్‌కుమార్ దర్శకత్వంలో రూపొందనున్న ఈ చిత్రం నవంబర్‌లో ఆరంభం అవుతుందట.