ఒక భాషలో హీరోగా నటిస్తున్న తారలు ఇతర భాషల్లో ప్రతినాయక పాత్రల్లో కనిపించేందుకు ఇంట్రస్ట్ చూపిస్తున్నారు. ఇప్పటికే తెలుగులో ఆది పినిశెట్టి విలన్‌గా దూసుకుపోతున్నాడు. తాజాగా కోలీవుడ్ విశాల్ కూడా మలయాళ సినిమాతో నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో మెప్పించాడు. ఇక బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ 2.ఓ కోసం విలన్‌గా మారాడు. తాజాగా ఈ లిస్ట్‌లో చేరేందుకు ఓ తెలుగు హీరో రెడీ అవుతున్నాడు.
అందాల రాక్షసి సినిమాతో టాలీవుడ్ పరిచయం అయిన నటుడు నవీన్ చంద్ర. తొలి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకున్న నవీన్, తరువాత హీరోగా సక్సెస్‌లు సాధించలేకపోయాడు. ఇటీవల అరవింద సమేతతో నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో ఆకట్టుకోవటంతో ఈ యువ నటుడికి కోలీవుడ్ నుంచి పిలుపు వచ్చింది.
తమిళ స్టార్ హీరో ధనుష్ హీరోగా దురై సెంథిల్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాలో నవీన్ ప్రతినాయక పాత్రలో కనిపించనున్నాడు. ఈ విషయాన్ని చిత్ర నిర్మాతలు అధికారికంగా ప్రకటించారు. మార్చి 6న ప్రారంభమైన ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానుంది.
Welcome on board #AndalaRakshasi & #AravindaSametha fame @Naveenc212. We are glad to have you play an important role in our film. pic.twitter.com/HVCo2ZWzXY
— Sathya Jyothi Films (@SathyaJyothi_) 27 March 2019
Comments
Please login to add a commentAdd a comment