మన దేశంలో ఉండే పర్యాటక ప్రదేశాలను చుట్టిరావడమే కష్టంగా ఉంటుంది. ఎందుకంటే బడ్జెట్, జర్నీ ప్లాన్ అన్నీ అనుకూలంగా ఉంటేనే సాధ్యం. ముఖ్యమైన పర్యాటక ప్రదేశాలు.. ఏ మూడో.. నాలుగో చుట్టి వచ్చి హమ్మయ్యా అనుకుంటాం. కానీ ఈ బామ్మ మాత్రం ఏకంగా ఏడు ఖండాలను చుట్టి రావాలనుకుంది. అక్కడ విభిన్న సంప్రదాయాలు, ప్రజల జీవనశైలిని గురించి తెలుకోవాలని ఆరాటపడింది ఈ బామ్మ. వృద్ధాప్యం సమీపిస్తున్న వెనక్కి తగ్గలేదు. చివరకు తాను అనుకున్నట్లుగానే ఏడు ఖండాలు చుట్టివచ్చి..అందిరిచే ప్రశంసలందుకుంది. ఆమె ఎవరంటే..
102 ఏళ్ల డోరతీ స్మిత్ అత్యంత సాహసోపేతమైన కలను నిజం చేసుకుని.. అద్భతమైన ఘనతను సాధించింది. మొత్తం ఏడు ఖండాలను సందర్శించి శెభాష్ అనిపించుకుంది. చాలాకాలంగా ఈ బామ్మ భూగోళాన్ని చుట్టిరావాలని కలలు కంది. ఆ కలను నిజం చేసుకునేలా..సుమారు ఆరు ఖండాలను సందర్శించింది. అయితే చివరి ఖండం వచ్చేటప్పటికీ వృద్ధరాలైపోవడంతో.. ఎలా? అని కలవరపడింది. అయితే "యస్ థియరీ" అనే యూట్యూబ ఛానెల్ క్రియేటర్స్ అమ్మర్ కందిల్, స్టాపన్ టేలర్ ఈ బామ్మ డ్రీమ్‌కు సాయం అందించారు.
ఈ క్రియేటర్స్ కాలిఫోర్నియాలోని రెడ్‌వుడ్స్ రిటైర్‌మెంట్ విలేజ్‌లో ఒక కథను చిత్రీకరిస్తుండగా .. బామ్మ స్మిత్‌ని కలిశారు. ఆమె జీవిత అభిరుచుకి ఫిదా అయ్యి..ఆమెకు సాయం చేసేందుకు ముందుక వచ్చారు. ఆమె చూడాల్సిన చివరి ఖండమైన ఆస్ట్రేలియాను తన కూతరు అడ్రియన్‌తో కలిసి వెళ్లేలా జర్నీ ప్లాన్ చేశారు ఈ క్రియేటర్స్. ఆ బామ్మ జర్నీలో కందిల్, టేలర్ కూడా చేరారు. ఇక 102 ఏళ్ల బామ్మ క్వాంటాస్ విమానంలోని బిజినెస్ క్లాస్‌లో ప్రయాణించి ఆస్ట్రేలియా చేరుకుంది.
అక్కడ చూడవల్సిన స్మిత్ సిడ్నీ హార్బర్ క్రూయిజ్, వైల్డ్ లైఫ్ సిడ్నీ జూ, ఒపేరా హౌస్, బోండి బీచ్ వంటి ప్రసిద్ధ పర్యాటక ప్రదేశాలన్నింటిని సందర్శించింది. తనకు ఈ సిడ్నీ పర్యటన అత్యంత మనోహరంగా ఉందని, అక్కడి ఆహారం, ప్రజల జీవనశైలి అత్యద్భుతంగా ఉన్నాయంటోంది స్మిత్. అంతేగాదు ఆస్ట్రేలియాలో టేకాఫ్‌కు ముందు పైలట్లు, సిబ్బంది ఆమెను సత్కరించడం విశేషం. అందుకు సంబంధించిన వీడియోని కూడా కందిల్, టేలర్ యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేయడంతో నెట్టింట తెగ వైరల్‌గా మారింది.
(చదవండి: ప్రపంచంలోనే చెత్త ఎయిర్‌లైన్స్.. ఇండిగో స్థానం ఇది!)
Comments
Please login to add a commentAdd a comment