
నా జీవితమే నాకొక కల
జరిగినవే తలచితివా శాంతి లేదు నీకూ అన్న మహాకవి గీతం గుర్తుకొస్తుంది నటి తమన్నా చెప్పింది విన్న వారెవరికైనా. ఈమె బహుభాషా నటి. పలు చిత్రాల్లో తనదైన నటనతో ప్రేక్షకులను మెప్పించారు. ఇంకా మంచి నటిగా గుర్తుంపు తెచ్చుకోవాలంటున్నారు. అదే తన లక్ష్యం అంటున్న తమన్నా మనసు విప్పిన వేళ చదవండి.నటినైనందుకు నేను చాలా సంతోషిస్తున్నాను. ఇప్పటి వరకూ నటించిన చిత్రాలన్నిటికీ ప్రేక్షకుల నుంచి ఆదరణ పొందాను. ఇకపై కూడా మంచి కథా పాత్రల్లోనే నటిస్తాను.తొలి రోజుల్లో తమిళం, తెలుగు భాషలు తెలియక షూటింగ్ స్పాట్‌లో చాలా కష్టపడ్డాను.
ఇతరులతో చెప్పించుకుని నటించే దానిని. తరువాత భాష తెలుసుకోవడంపై ఆసక్తి కనబరచాను. ఇప్పుడు ఈ రెండు భాషలు చక్కగా మాట్లాడగలుగుతున్నాను. అనుకున్నది సాధించాలన్న విషయంలో దృఢనిశ్చయంతో ఉంటాను.అదే నా బలం.ఇక జరిగిన విషయాల గురించి తలచుకుంటూ బాధ పడుతుంటాను.ఇదే నా బలహీనం.నాకు దైవ నమ్మకం చాలా ఉంది.నిత్యం ఉదయాన్నే శారీరక కసరత్తులు చేస్తాను. డబ్బు అవసరాలకు తగినంతే ఉండాలి.
దీనికి మించి ఉంటే మనశ్శాంతిని దూరం చేస్తుంది. ఇక అందం అనేది చూసే కళ్లల్లో ఉండదనేది నా భావన. అది మనసుకు సంబంధించింది. మంచి మనసు కలిగిన వారే అందమైనవారు. నేను కలలు కనను. నటిగా ఈ జీవితమే నాకొక కల. నటి జ్యోతిక అంటే చాలా ఇష్టం. నేనామె వీరాభిమానిని. బాలీవుడ్‌లో హృతిక్‌రోషన్, మాధురీ దీక్షిత్, ప్రీతిజింతా, కరీనాకపూర్ అంటే నాకు చాలి ఇష్టం అని ఈ మిల్కీ బ్యూటీ తన మనసులోని భావాలను బయట పెట్టింది.