నాకు తరచు కలలో పాములు కనిపిస్తుంటాయి. ఇది దేనికి సంకేతం?
కలలో పాములు కనిపిస్తున్నాయని మీరు ఆందోళన పడనక్కరలేదు. ఇది శుభానికే సంకేతం. మీకు త్వరలో ఆకస్మిక ధన ్రపాప్తి కలగబోతోందనడానికి సూచన అది. అంతేకాదు, మీకు సంతానం కలగబోతోందనడానికి కూడా సంకేతం కావచ్చు. సాధారణంగా కలలో పాములు కనిపించడం అనేది తీరని కోరికలకు సంకేతం. ఒకోసారి ఆ కోరికలు కార్యరూపం దాల్చబోతున్నాయనడానికి కూడా సూచికగా తీసుకోవచ్చు.
దిష్టి తీయడానికి ఎర్రనీళ్లనే ఎందుకు ఉపయోగిస్తారు?
వివాహాది శుభకార్యాలలో, నూతన వధూవరుల గృహప్రవేశ సమయంలోనూ, ఇంటిలో ఎవరైనా జబ్బుపడి లేచి స్వస్థత చేకూరి ఇంటికి వచ్చేటప్పుడూ ఎర్రనీళ్లతో దిష్టితీస్తారు. పసుపు, సున్నం నీళ్లు కలిపితే ఎర్రనీళ్లు తయారవుతాయి. ఈ ఎర్రనీళ్లను పళ్లెంలో పోసి దిష్టి తీస్తారు. ఆ నీళ్లను ఎవరూ తొక్కనిచోట పారబోస్తారు. గృహప్రవేశానికి ముందు తియ్యగుమ్మకు చిన్న రంధ్రం చేసి పారాణి ముద్దను ఉంచుతారు. దాన్ని దిష్టితీసి పగలగొడతారు. కొంతమంది ఎండుమిరపకాయలతో, మరికొందరు నూనెలో తడిపి వెలిగించిన గుడ్డపీలికలతోటీ దిష్టి తీస్తారు. ఘాటైన పదార్థాలు, ఎర్రని వస్తువులు దిష్టిని పోగొట్టడంలో శక్తిమంతంగా పని చేస్తాయని ఇలా చేస్తారు.
ఇంటిలోకి దుష్ట శక్తులు రాకుండా ఉండాలంటే ఏం చేయాలి?
తులసి చెట్టు, నిమ్మ, వేప వంటివి ఇంటిలోకి దుష్టశక్తులను రానివ్వకుండా చేస్తాయని శాస్త్రం చెబుతోంది. అంతేకాకుండా దిష్టి తగలకుండా ఉండడం కోసం వాకిలి వద్ద కొంతమంది బూడిద గుమ్మడి కాయలు కట్టుకుంటారు. అదేవిధంగా పటికను ఎర్ర లేదా నల్లటి వస్త్రంలో మూటగట్టి ఇంటి గుమ్మానికి వేలాడదీస్తారు. ఇష్టదైవానికి సంబంధించిన చిన్న పటాలను గుమ్మానికి తగిలించడం కూడా మంచిదే.
Comments
Please login to add a commentAdd a comment